
ఒంగోలు, (జనస్వరం) : ఒంగోలులోని జనసేనపార్టీ కార్యాలయంలో ప్రకాశం జిల్లా జనసేనపార్టీ అధ్యక్షులు షేక్ రియాజ్ టీం పొలిటికల్ సేన రెండోవ వార్షికోత్సవ పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అరుణ రాయపాటి, ప్రకాశం జిల్లా జనసేనపార్టీ ఉపాధ్యక్షులు చిట్టెం ప్రసాద్, ప్రకాశం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శులు చనపతి రాంబాబు, కళ్యాణ్ ముత్యాల, ఒంగోలు నగర జనసేనపార్టీ ప్రధాన కార్యదర్శి పల్ల ప్రమీల, ఒంగోలు నగర జనసేన పార్టీ సంయుక్త కార్యదర్శి ఆకుపాటి ఉష, వీర మహిళ సుంకర కళ్యాణి, జనసేన నాయకులు పర్చూరి అవినాష్, అశోక్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.