కలువాయి, (జనస్వరం) : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఆత్మహత్య చేసుకొని చనిపోయిన మూడు వేల మంది కౌలు రైతులుకు ప్రతి కుటుంబానికి లక్ష రూపాయల చొప్పున మూడు వేల కుటుంబాలకు 30 కోట్ల రూపాయలు ఆర్థిక సహాయం అందజేస్తున్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. ఈ విషయాన్ని రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఒక్కరికి తెలియజేయాలని గొప్ప సంకల్పంతో టీమ్ పిడికిలి వారి సౌజన్యంతో గోడ పత్రికలు, ఆటో స్టిక్కర్లు కలువాయి మండలంలో ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ పోస్టర్లు మాకు అందించిన టీం పిడికిలి సభ్యులు రాజా మైలరపుకి, మండల ఉపాధ్యక్షులు నరేష్ కి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నెల్లూరు జిల్లా సంయుక్త కార్యదర్శి ఆరవ రాజేష్, వెంకటగిరి మండల అధ్యక్షులు గుగ్గిళ్ళ నాగరాజు, జనసేన నాయకులు కోన.రవి శంకర్, రాపూర్ మండల అధ్యక్షుడు పెంచలయ్య, కలువాయి మండల అధ్యక్షులు మనోహర్, ఉపాధ్యక్షులు నరేష్, స్థానిక జనసేన నాయకులు రాము, వెంకటపతి, గణేష్, హరి, ప్రసాద్ పాల్గొనడం జరిగింది.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com