Logo
Date of Publish : 10 May 2022, 3:07 pm
Editor : Sake Naresh

కదిరిలో టీం పిడికిలి – జనసేనపార్టీ రైతు భరోసా యాత్ర పోస్టర్ విడుదల

          కదిరి ( జనస్వరం ) : రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 3000 మంది ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు 30 కోట్ల రూపాయలతో తన సొంత నిధుల నుంచి ఒక్కొక్క కుటుంబం కు లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందిస్తూ, ఆ రైతుల కుటుంబాలకు అండగా ఉండాలని అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు రైతు భరోసా యాత్రను రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించడం జరిగింది. ఈ రైతు భరోసా యాత్ర గురించి రాష్ట్ర ప్రజలకు తెలిసేలా NRI జనసేనపార్టీ విభాగం మైలవరం రాజ గారు టీమ్ పిడికిలి ఆద్వర్యంలో పోస్టర్లు ముద్రించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 175 నియోజకవర్గాల్లో ఈ రైతు భరోసా యాత్ర పోస్టర్లు శ్రీ సత్య సాయి జిల్లా కదిరి నియోజక వర్గం జన సేన పార్టీ ఇంచార్జీ శ్రీ భైరవ ప్రసాద్ గారి చేతుల మీదుగా విడుదల చెయ్యడం జరిగింది. వారు మాట్లాడుతూ మన కదిరి నియోజకవర్గ పరిధిలోని కొన్ని కుటుంబాలకు పవన్ కళ్యాణ్ గారు ఒక్కొక్క కుటుంబంకు లక్ష రూపాయల వంతున సహాయం చేయడాన్ని కదిరి జనసేనపార్టీ తరుపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు. అలాగే జనసేనపార్టీ ఎప్పుడూ రైతుల తరపున వారికి అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ కార్యక్రమాల నిర్వహణ కమిటీ సభ్యులు కుటాల లక్ష్మణ, అంజిబాబు, మహబూబ్ బాషా, ఐటీ టీమ్ సభ్యులు పొరకల రాజేంద్ర, మధుసూదన్, నవీన్,నాగరాజు, సోము శేఖర్, అల్తాఫ్, కుమార్, రాజు, లక్ష్మీనారాయణ, లక్ష్మిదేవి,  శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com