Logo
Date of Publish : 12 February 2026, 10:36 am
Editor : Sake Naresh

మాకొడికి పాఠశాలకు ఉపాధ్యాయుడు వి.ఏ. వెంకటేశులు రూ.40,116 విరాళం

శెట్టూరు, ఫిబ్రవరి 11, (జనస్వరం) : భావి భారత పౌరుల భవిష్యత్తు కోసం పాఠశాలలను బలోపేతం చేయడం మనందరి బాధ్యత అని చాటి మాకొడికి గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు వి.ఏ. వెంకటేశులు ఉదారతను ప్రదర్శించారు. పాఠశాల మౌలిక సదుపాయాల మెరుగుదల కోసం రూ.40,116 నగదును స్వచ్ఛందంగా విరాళంగా ప్రకటించి, ఆ మొత్తాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాసులకు ఉపాధ్యాయ బృందం సమక్షంలో అందజేశారు. ప్రస్తుతం మాకొడికి తాండాలో ఎస్జీ టీచర్‌గా విధులు నిర్వహిస్తున్న వెంకటేశులు, తన వృత్తిపట్ల ఉన్న నిబద్ధతతో పాటు గ్రామంలోని విద్యార్థులు మెరుగైన వసతులతో చదువుకోవాలనే సంకల్పంతో ఈ సహాయం అందించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యార్థుల భవిష్యత్తుకు పునాది వేసే పాఠశాలల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. శాసనసభ్యుడు అమిలినేని సురేంద్ర బాబు ఇచ్చిన పిలుపుతో గ్రామంలో విద్యారంగంపై చైతన్యం పెరిగిందని, దాతలు స్వచ్ఛందంగా ముందుకు రావడం అభినందనీయమని గ్రామస్తులు పేర్కొన్నారు. ఒక ఉపాధ్యాయుడే స్వయంగా ఇంత పెద్ద మొత్తాన్ని విరాళంగా అందించడం పట్ల తోటి ఉపాధ్యాయులు, గ్రామ ప్రజలు వెంకటేశులను ఘనంగా అభినందించారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com