Logo
Date of Publish : 25 July 2026, 5:10 am
Editor : Sake Naresh

ఇనమడుగులో ‘మెగా పీటీఎం 4.0’ కార్యక్రమాన్ని ప్రారంభించిన టీడీపీ నాయకులు

- విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడమే కూటమి ప్రభుత్వ ధ్యేయం

- టీడీపీ మండల అధ్యక్షులు కొల్లారెడ్డి సుధాకర్ రెడ్డి

కోవూరు, జూలై 24 (జనస్వరం): ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు, నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి సూచనలతో శుక్రవారం ఇనమడుగు గ్రామంలో 'తల్లిదండ్రులు–ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం (మెగా పీటీఎం 4.0)' కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కోవూరు టీడీపీ మండల అధ్యక్షులు కొల్లారెడ్డి సుధాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు, కళాశాలల ప్రధానోపాధ్యాయులు, అధ్యాపకులు, విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి ఆయన సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొల్లారెడ్డి సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ, విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల భాగస్వామ్యం ఎంతో కీలకమని, విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని పేర్కొన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న విద్యా సంస్కరణలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుని విద్యార్థుల అభివృద్ధికి సహకరించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో చింతలపూడి పెంచలయ్య, వెలగపూడి శ్రీనివాసులు, ఎస్‌కే సుభాన్, రాజ్యం నరేంద్ర, గిద్దలూరు ఉమా, పెరిమి చెంచమ్మ, సోడంశెట్టి సుమలత, హకీమ్, నాసిన వెంకటేష్, స్థానిక నాయకులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com