అనంతపురం ( జనస్వరం ) : రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టును ఖండిస్తూ… తోడుగా మేము సైతం అంటూ టిడిపి నాయకులు అనంతపురము నగరంలోని రాంనగర్ స్థానిక కమ్మ భవన్ వద్ద చేపట్టిన నిరసన దీక్షకు జనసేన జిల్లా అధ్యక్షులు మరియు అనంతపురము అర్బన్ ఇంచార్జ్ టీ.సి.వరుణ్ తమ సంపూర్ణ సంఘీభావం తెలిపారు. మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి ఆధ్వర్యంలో తలపెట్టిన రేలే నిరసన దీక్షకు టి.సి.వరుణ్ ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో నాయకులు, జనసైనికులు మరియు వీరమహిళలు హాజరయ్యారు. ఈ సందర్భంగా టి.సి.వరుణ్ గారు మాట్లాడుతూ.. రాష్ట్రంలో రాక్షస పాలన రాజ్యం ఏలుతోందన్నారు. ప్రధాన ప్రతిపక్ష నేతను సరైన ఆధారాలు చూపకుండా అరెస్ట్ చేయడం అప్రజా స్వామికమన్నారు. చంద్రబాబు నాయుడు గారికి సంఘీభావంగా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు నిలిచారని.. ఆయన ఆదేశాలను శిరసా వహిస్తూ.. తెలుగుదేశం చేపట్టిన నిరసన కార్యక్రమాలలో పాల్గొంటున్నామన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికార మదంతో కన్ను మిన్ను కాకుండా అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను యావత్ రాష్ట్ర ప్రజలు ఎవగించుకుంటున్నారన్నారు. అయినా సిగ్గు లేకుండా బహిరంగ సభల్లో ప్రతిపక్షాలపై విమర్శలు చేయడం జగన్మోహన్ రెడ్డి విజ్ఞతకు నిదర్శన ఉన్నారు. వైసిపి ప్రభుత్వానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందని.. మరో ఆరు నెలల్లో జనసేన టిడిపి ఆధ్వర్యంలో ప్రజా ప్రభుత్వం ఏర్పాటు కాబోతోంది అన్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఆకృత్యాలు సృష్టించిన ప్రతి ఒకరికి గుణపాఠం చెప్పి తీరుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో రాయలసీమ ప్రాంతీయ మహిళా కమిటీ సభ్యులు పెండ్యాల శ్రీలత, జిల్లా ఉపాధ్యక్షులు అంకె ఈశ్వరయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శులు కుమ్మర నాగేంద్ర, కార్యదర్శులు రాపా ధనంజయ్, సిద్ధూ, జయమ్మ, ముప్పూరి కృష్ణ, నగర ప్రధాన కార్యదర్శులు మేదర వెంకటేష్, చక్రపాణి, హుస్సేన్, దరాజ్ భాష, నగర కార్యదర్శులు అంజి, సంపత్, వెంకటరమణ, ఆకుల అశోక్, పవన్ కుమార్, కార్యక్రమాల కమిటీ సభ్యులు సంతోష్, వీరమహిళ శ్రీమతి అనసూయ మరియు నాయకులు MV.శ్రీనివాస్, శామీర్, ఆది నాయక్, చరణ్, కాకర్ల శీన, ఆంజనేయులు తదితరులు పాల్గొనడం జరిగింది.