అనంతపురము ( జనస్వరం ) : నగరంలో తాగునీటి ఎద్దడి చోటుచేసుకుంది. మరికొన్ని కాలనీలో సమస్య మరింత తీవ్రంగా మారింది. దీంతో రక్షిత మంచినీటి కోసం అశోక్ నగర్ ప్రజలు గుక్కెడు నీటి కోసం అధికారులకు విన్నవించిన ఫలితం లేకుండా పోయింది. దీంతో శుక్రవారము జిల్లా జనసేన అధ్యక్షులు మరియు అనంతపురము అర్బన్ ఇంచార్జ్ టి.సి.వరుణ్ గారిని ఫోన్ ద్వారా సంప్రదించారు. వెంటనే స్పందించిన టి.సి.వరుణ్ గారు ఈ రోజు ఉదయం అశోక్ నగర్ కి జనసేన ఉచిత రక్షిత మంచినీటి ట్యాంకులను పంపించారు. తమ సమస్యను విన్న వెంటనే స్పందించిన టి.సి.వరుణ్ గారికి కాలనీవాసులు కృతజ్ఞతలు తెలిపారు. నాయకులు ఎస్.నజీర్, నగర ప్రధాన కార్యదర్శిలు మేదర వెంకటేష్, హుస్సేన్, దరాజ్ భాష, నగర కార్యదర్శులు రాజేష్ కన్నా, కుమ్మర మురళి, అంజి, ఆకుల అశోక్, తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com