అనంతపురం ( జనస్వరం ) : రాప్తాడులో ముఖ్యమంత్రి నిర్వహించిన సిద్ధం సభలో వైసిపి మూకల దాడిలో గాయపడిన పాత్రికేయులను జనసేన జిల్లా అధ్యక్షులు మరియు అనంతపురము అర్బన్ ఇంచార్జ్ టి.సి.వరుణ్ గారు పరామర్శించారు. టీవీ5 పాత్రికేయులు అనిల్ గారి ఇంటికి వెళ్లి ఆయన్ను పరామర్శించారు. తీవ్ర గాయాలతో హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో మెరుగైన వైద్యం చేయించుకునేందుకు వెళ్తున్న ఫోటోగ్రాఫర్ కృష్ణ గారిని ఫోన్ ద్వారా టి.సి.వరుణ్ పరామర్శించారు. పాత్రికేయులపై దాడిని తీవ్రంగా ఖండించారు. అధైర్య పడకండి మీకు జనసేన పార్టీ అండగా నిలుస్తుందని టి.సి.వరుణ్ గారు వారికి భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో నగర అధ్యక్షులు పొదిలి బాబురావు, జిల్లా ఉపాధ్యక్షులు అంకె ఈశ్వరయ్య, జిల్లా ప్రధానకార్యదర్శి పత్తి చంద్రశేఖర్, జిల్లా కార్యదర్శులు రాపా ధనంజయ్, ఇండ్ల కిరణ్ కుమార్, అవుకు విజయకుమార్, ముప్పూరి కృష్ణ, నగర ప్రధాన కార్యదర్శిలు హుస్సేన్, నగర కార్యదర్శిలు కుమ్మర మురళి, అంజి, సంపత్, ఆకుల అశోక్, మంగళ కృష్ణ, నాయకులు బళ్లారి అనిల్, అశోక్, విజయ రాయల్, ఉదయ్ తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com