అనంతపురం ( జనస్వరం ) : సంఘమిత్ర కాలనీలో 10 రోజులుగా తాగునీటి ఎద్దడి ఎదురుపడుతున్న కాలనీ ప్రజలు మున్సిపల్ అధికారులకు స్థానిక ప్రజాప్రతినిధులకు మొరపెట్టుకున్న సమస్య పరిష్కారం కాలేదు. వేసవిలో అనంత ప్రజల కోసం జనసేన జిల్లా అధ్యక్షులు, అర్బన్ ఇంచార్జ్ టీ.సి.వరుణ్ ఉచితంగా రక్షిత మంచినీరు పంపిణీ చేశారు. ఆ సమయంలో ఏ కాలనీలో అయినా సమస్య ఉంటే ఈ నెంబర్కు ఫోన్ చేయాలని హెల్ప్ లైన్ నెంబర్ ఏర్పాటు చేసిన విషయం విధితమే. పది రోజులుగా సంఘమిత్ర కాలనీలో నీటి సమస్య ఎదురు కావడంతో కాలనీవాసులు హెల్ప్ లైన్ నంబర్ ద్వార అనంతపురము అర్బన్ ఇంచార్జ్ టి.సి.వరుణ్ ని సంప్రదించారు. వెంటనే స్పందించిన టి.సి.వరుణ్ కాలనీ వాసుల సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ట్యాంకర్ల ద్వారా కాలనీకి మంచినీటిని సరఫరా చేయించారు. సంఘమిత్ర కాలనీ ప్రజలకు అన్నివేళలా అందుబాటులో ఉంటూ అండగా నిలుస్తానని భరోసా ఇచ్చారు. ఒక్క ఫోన్ కాల్ ద్వారానే స్పందించి తమ సమస్యను పరిష్కరించిన శ్రీ టి.సి.వరుణ్ గారికి కాలనీవాసులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు అంకె ఈశ్వరయ్య, నగర ఉపాధ్యక్షులు సదానందం, జిల్లా ప్రధాన కార్యదర్శిలు కుమ్మర నాగేంద్ర, జిల్లా కార్యదర్శిలు రాపా ధనుంజయ్, ఇండ్ల కిరణ్ కుమార్, సిద్దు, ఆవుకు విజయకుమార్, ముప్పూరి కృష్ణ, నగర ప్రధాన కార్యదర్శిలు మేదర వెంకటేష్, హుస్సేన్, నగర కార్యదర్శిలు కుమ్మర మురళి, అంజి, సంపత్, వల్లంశెట్టి రమణ, శ్ఆకుల అశోక్, నాయకులు విజయ్ రాయల్, ఉదయ్, నౌషాద్ తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com