అనంతపురము ( జనస్వరం ) : నగరంలో తక్కువ ధరకే రక్షిత మంచినీటిని అందించాలన్న సంకల్పంతో జనసేన నాయకులు తాతయ్య ఏర్పాటు చేసిన రక్షిత మంచినీటి ట్యాంకర్ ను గురువారం జనసేన జిల్లా అధ్యక్షులు, అనంతపురము అర్బన్ ఇంచార్జ్ టీ.సి.వరుణ్ ప్రారంభించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జనసేన రాష్ట్ర కార్యనిర్వహణ ప్రధాన కార్యదర్శి భవాని రవికుమార్ లు హాజరై జెండా ఊపి ప్రారంభించారు. ముందుగా అశోక్ నగర్ లోని హరిహర దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... అనంత నగరవాసుల సౌలభ్యం కోసం తక్కువ దొరికే రక్షిత మంచినీటిని అందించాలన్న జనసేన నాయకులు తాతయ్య గారి సంకల్పాన్ని అభినందించారు. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో జనసేన నాయకులు సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలకు మరింత చేరవ కావాలని సూచించారు. అనంతరం టీ.సి.వరుణ్, భవాని రవికుమార్, మెగాస్టార్ చిరంజీవి సీనియర్ అభిమానులు కాయగూరల లక్ష్మి ప్రసాద్, పెద్దలు పేరూరు శ్రీనివాస్, నగర ప్రధాన కార్యదర్శి చక్రపాణి లను తాతయ్య గారు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో జనసేన నాయకులు, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com