కరోనా విపత్కర సమయంలో ప్రజలపై భారం మోపే విధంగా అస్తి పన్నులు పెంచడం సరికాదని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్యనారాయణ గారు అన్నారు. ఈ మేరకు శనివారం జీవీఎంసీ కమిషనర్‌కు పన్నులు మినహాయింపు ఇవ్వాలని కోరుతూ లేఖ రాశారు. ఈ సందర్భంగా ఆయన లేఖలో పలు, విషయాలను ప్రస్తావించారు. పన్నులు పెంచే అధికారం జివిఎంసికి ఉందిగానీ పన్నులు, తగ్గించాల్సిన ఈ కరోనా సమయంలో పెంచడం భావ్యంకాదని, ఒకవేళ పన్నుపెంచాల్సి వస్తే ఆ ప్రక్రియ చేసే ముందు తీసుకోవలసిన కొన్ని చర్యలను బొలిశెట్టి సత్యనారాయణ గారు సూచించారు. కార్భారేషన్ 2013 నుంచి 2021 వరకు స్పెషల్ ఆఫీసర్ల అధీనంలో ఉంది. ఆ సమయంలో జివిఎంసి వసూలు చేసిన పన్నుఎంత ? ఆ మొత్తాన్ని ఏ విధంగా ఖర్చు చేశారు? ఆయా వివరాలు ఎన్నికైన కౌన్సిల్ ముందు ఉంచాలన్నారు. కేంద్రం నుంచి పట్టణ అభివృద్ధికి మురికివాడల అభివృద్ధికి పర్యావరణ పరిరక్షనకు, మంచినీటికి నిధులు ఏ మేరకు రాబట్టుకోవచ్చు తెలుసుకొని దానికై ఆచరించవలసిన పద్దతులు అన్వేషించి ఆచరించాలని, దుబారా ఖర్చులు, తగ్గించుకోవాలన్నారు. అప్పటికి ఇంకా నిధులు అవసరం అనుకుంటే అప్పుడు పనులు మేరకు విధించవచ్చు అన్నది అధ్యయనం చేసి దానిని ప్రజల ముందు ఉంచి, ప్రజామోదం పొందిన తరువాతనే పన్నులు పెంచాలన్నారు. ఎన్నికలకు ముందే పన్ను పెంపుపై నవంబర్ 2020 లోనే జీవో నంబర్ 186, 15, 198 ఇవ్వడం తప్పని ఇంటిపన్నులు 1ఏప్రిల్ 20 21 నుంచిపెంచాలని అనుకున్నప్పుడు దానికి సంబంధించిన పబ్లిక్ నోటీస్ ఫిబ్రవరి నెలలో ఇవ్వాల్సి ఉండగా, కానీ దానీని కార్పొరేషన్ ఎన్నికలు అయ్యేంత వరకు దాచిపెట్టి 2021 జూన్ 4వ తారీఖున ఇవ్వడం ముమ్మాటికీ కమీషనర్ అధికార పార్టీకి కొమ్ము కాస్తూ ప్రజలను మోసగించడమేనని దీనికి మున్సిపల్ కమిషనర్ కు బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. అవసరమైతే ఈ విషయంపై తాను హెచ్చరించారు. ఈ విషయాన్ని త్వరలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లి అవసరమైన కార్యాచరణతో ఈ అక్రమ, అమానవీయ పన్ను పెంపు నిలుపుదలకు కృషి చేస్తామని పేర్కొన్నారు.