రాజంపేట ( జనస్వరం ) : జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ను పావలా కళ్యాణ్ అని సంబోధిస్తున్నావే రూపాయలతో ప్రారంభమైన నీ జీవితం నేడు వందల కోట్ల రూపాయలకు ఎలా చేరిందని తాత౦శెట్టి నాగేంద్ర విమర్శించారు. బుధవారం జగనన్న కాలనీల దుస్థితిని పరిశీలించడానికి నాగేంద్రతో పాటు నియోజకవర్గ జనసేన నాయకులు చిట్వేలు మండలంలో పర్యటించారు. ఈ సందర్భంగా తిమ్మాయపాలెం గ్రామపంచాయతీ గట్టుమీద పల్లెలో నీ జగనన్న కాలనీని పరిశీలించారు. అక్కడ వారు విలేకరులతో మాట్లాడుతూ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు తాను ఎమ్మెల్యేగా గెలవక ముందు ఆయన పరిస్థితి ఏందో తెలుసుకోవాలని సూచించారు. వాళ్ల పూర్వికులు కోటీశ్వరులు ఏమీ కాదని లేక గెలవగానే నాలుగు సార్లు అందలకోట్ల రూపాయల ఆస్తులకు ఎలా అధిపతి అయ్యావని ప్రశ్నించారు. గోవా, తిరుపతి, హైదరాబాద్, విజయవాడ, అమెరికా లాంటి చోట్ల ఆస్తులను కూడగట్టి వందల కోట్ల రూపాయలు నిజాయితీగా సంపాదించావా అని అడిగారు. మరోసారి పవన్ కళ్యాణ్ పై అనవసర విమర్శలు చేస్తే కొర్రముట్ల అవినీతిని కోడూరు నియోజకవర్గంలోని ప్రతి మండలంలోనూ తిరిగి తిరిగి ప్రచారం చేస్తానని చెప్పారు. జగనన్న కాలనీలలో మౌలిక వసతులు కనిపించడం లేదన్నారు. నియోజకవర్గం లో ఏడు వేలకు పైగా ఇల్లు మంజూరు అయితే కేవలం 900 మాత్రమే కట్టుకున్నారని, కూడా వైసీపీ వారేనని వివరించారు. ఇల్లు కట్టుకోవడానికి ప్రభుత్వమిచ్చే డబ్బు సరిపోక పేదలు అప్పులు చేయలేక ఇండ్లను తట్టుకోలేకపోతున్నారని చెప్పారు. అయినా సరే వైసీపీ ప్రభుత్వం జగనన్న కాలనీలను అద్భుతమైన పథకంగా ప్రచారం చేసుకోవడం వారి నైతికతకు నిదర్శనం అన్నారు. గట్టుమీద పల్లె జగనన్న కాలనీలో 50 ఏళ్లకు పైగా మంజూరు అయితే ఒక్క ఇల్లు కూడా పూర్తి కాలేదని, కేవలం నాలుగైదు ఇల్లు మాత్రమే పునాదులు, మిగిలినవి గుంతలు గానే మిగిలి ఉన్నాయని విమర్శించారు. కార్యక్రమంలో… జిల్లా జనసేన నాయకులు జోగినేని మనీ రైల్వే కోడూరు నాయకులు పగడాల వెంకటేష్, చిట్వేలు జనసేన నాయకులు మాదాసు నరసింహ, కంచర్ల సుధీర్ రెడ్డి, ఉమ్మడి కడప జిల్లా ప్రోగ్రాం కమిటీ నెంబర్ మాదాసు శివ, పగడాల శివ, దాసరి వీరేంద్ర, రాయల్ కొనిశెట్టి, చక్రి, పవన్, రాజు, ఆనందలతేజ, రాయల్ నాగిశెట్టి, శివ, సువారపు హరి రాయల్ జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు.