Logo
Date of Publish : 08 January 2022, 4:43 pm
Editor : Sake Naresh

కుళాయి మరమ్మతులు చేపట్టి గిరిజనులకు మంచినీరు అందించాలి : అరకు జనసేన నాయకులు సాయిబాబా

 అరకు, (జనస్వరం) : విశాఖ మన్యం అరకు నియోజకవర్గం అనంతగిరి మండలం, కొండిబ పంచాయితీ పరిధిలో గలమువ్వం గూడ గ్రామాల్లో శనివారం ఉదయం జనసేన బృందం ఆధ్వర్యంలో గ్రామంలో పర్యటించడం జరిగింది. పర్యటనలో భాగంగా గ్రామస్తులతో సమావేశమై సమస్యల పట్ల చర్చించడం జరిగింది. ముఖ్యంగా ఆయా గ్రామంలో కుళాయి మరమత్తు అవడం వలన మంచినీటి కోసం తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నట్లు జనసేన పార్టీ దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా సాయిబాబా, దురియా, సన్యాసి రావు తదితరులు మాట్లాడుతూ ముందుగా జనసేన మాటలు జనంలోకి తీసుకెళ్లారు. అనంతరం మువ్వంగూడ గ్రామంలో కుళాయి మరమ్మతులు ఉన్నప్పటికీ సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడం చాలా విడ్డూరంగా ఉందని, తక్షణమే ప్రభుత్వ సంబంధిత అధికారులు చొరవ తీసుకొని కుళాయి మరమ్మతులు చేపట్టి గిరిజనులకు మంచినీరు అందించగలరని ఈ సందర్భంగా ప్రభుత్వానికి జనసేన పార్టీ తరుపున డిమాండ్ చేశారు. రాష్ట్రంలో వైయస్సార్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నేల నుండి ఆకాశం అందే వరకు నిత్యావసర సరుకులు విపరీతంగా పెరిగాయని ఈ సందర్భంగా గుర్తు చేశారు. కావున రానున్న రోజుల్లో వైయస్సార్ పార్టీకి బుద్ధి చెప్పాలని, రానున్న రోజుల్లో జనసేన పార్టీని ఆదరించాలని గిరిజనులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జనసైనికులు నర్సింగ్ గ్రామ ప్రజలు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com