తణుకు నియోజకవర్గం ఇరగవరం మండలం రేలంగి గ్రామం లో వైస్సార్ పార్టీ వారు ఏర్పాటు చేసిన ఇళ్ల స్థలాల పంపిణి కార్యక్రమంలో ప్రమాదవస్తు కొబ్బరి చెట్టు విరిగిపడి ఇద్దరు మరణించగా తీవ్రంగా గాయపడిన ఆరుగురు మహిళలను తణుకు జిల్లా కేంద్ర హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. ఈ ఆరుగురు క్షతగాత్రులను హాస్పిటల్ నందు తణుకు జనసేన పార్టీ ఇంచార్జ్ శ్రీ విడివాడ రామచంద్రరావు ఆత్మీయంగా పలకరించి తనవంతు సాయంగా మరణించిన కుటుంబానికి 10000/- రూపాయలు మరియు గాయపడిన వారికీ 5000/- రూపాయలు ఆర్ధిక సాయం చేసినారు. ఈ కార్యక్రమంలో పార్టీ లీగల్ సెల్ మెంబెర్ అనుకుల రమేష్ మరియు కాట్నం విశాలి, తెలగారెడ్డి లక్ష్మి, ఆకేటి కాశీ, పంతం నానాజీ తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com