Logo
Date of Publish : 31 October 2022, 2:30 pm
Editor : Sake Naresh

కేసులు తారుమారు చేస్తే సహించేది లేదు : పిఠాపురం ఇంఛార్జ్ మాకినీడి శేషుకుమారి

    పిఠాపురం, (జనస్వరం) : కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి మండలం ఇటీవల ఉప్పాడ కొత్తపట్నంకి చెందిన జనసేన కార్యకర్త చెక్కా దుర్గా ప్రసాద్ దండగుల దాడిలో గాయపడి చికిత్స పొందుతున్న విషయం విధితమే. అయితే గాయపరచిన దుండగులు మీద స్థనిక కొత్తపల్లి పోలీస్ స్టేషన్ లో ఎటెంప్టివ్ మర్డర్ కేసు నమోదు చేయకుండా సింపిల్ గా వుండే పెట్టీ కేసుగా నమోదు చేయడంతో జనసేనపార్టీ పిఠాపురం ఇంచార్జ్ మాకీనీడి శేషకుమారి మండిపడ్డారు. న్యాయవాది సిరిపిరెడ్డి గణేష్ ని స్టేషన్ కి తీసుకుని వెళ్ళి ఆరా తీయగా పైవిధంగా చెప్పడం జరిగింది. వీటిని కేసును తప్పుత్రోవ పట్టిస్తున్న పోలీస్ వారు తమ కార్యాకర్తకి న్యాయం చేయకపోతే నియోజకవర్గ కార్యకర్తలను, జనసైనికులను కలుపుకుని పోరాటం చేస్తామని, బాదితుడి సంబందించిన మహిళలను చీరలాగి జాకెట్ చించి అగౌరపరిస్తే పిట్టీ కేసులా కట్టడం అనేది ఎంతవరకు న్యాయమే పోలీసు వారు ఆలోచించాలని ప్రశ్నించారు. జనసేన కార్యకర్తపై జరిగింది ఎటెంటూ మర్డర్ దానికి సంబందించిన సెక్షన్ నమోదుదు చేయకుండా నీరుకార్చడం మంచి పద్దతి కాదని కఠినమైన సెక్షన్ క్రింద కేసు నమోదు చేయాలని పోలీసు వారిని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యు కొత్తపల్లి మండల ప్రెసిడెంట్ పట్టా శివ, నాయకులు, జనసైనికులు, బాధిత కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com