తంబళ్లపల్లి, (జనస్వరం) : జనసేన పార్టీ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు, చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా.పసుపులేటి హరిప్రసాద్ తంబళ్లపల్లె నియోజకవర్గ మండల కమిటి సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తంబళ్లపల్లి జిల్లా కమిటి నాయకులు బండి వెంకటేశ్వరలు, గజ్జల రెడప్ప ఆధ్వర్యంలో జరిగిన మండల కమిటీ సభ్యుల సమీక్షా సమావేశంలో జిల్లా, రాష్ట్ర కార్యవర్గ సభ్యులతో కలిసి మండల అధ్యక్షులకు మరియు మండల కమిటీ సభ్యులకు దిశానిర్దేశం చేస్తూ కమిటీ సభ్యులు అందరూ కలిసి ఓటర్ కి, లీడర్ కి మధ్య అనుసంధానంగా పని చేస్తూ మండల, గ్రామ స్థాయిలో పార్టీని బలోపేతం చేసే దిశగా విది విధానాలను అనుసరిస్తూ నియోజకవర్గ పరిధిలోని అన్ని వర్గాల ప్రజలను పార్టీలోకి ఆహ్వానించాలని సూచించారు. అదేవిధంగా మిషన్ 3000 అనే బృహత్తర కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేయాలని, యువతి యువకులు పార్టీలో కీలక పాత్ర పోషించే విధంగా నాయకులు పార్టీ అధ్యక్షుల గొప్ప వ్యక్తిత్వాన్ని ఆయన ఆశయాలను, పార్టీ సిద్ధాంతాలను బలంగా తీసుకెళ్లాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యక్రమాలు నిర్వాహక కమిటీ కో ఆర్డినేటర్ శ్రీ పగడాల మురళి, జిల్లా లీగల్ సెల్ అధ్యక్షులు శ్రీ అమర్ నారాయణ, జిల్లా ప్రధాన కార్యదర్శులు శ్రీమతి అనిత దారం, శ్రీ తులసి ప్రసాద్, జిల్లా కార్యదర్శులు దేవర మనోహర, తంబళ్లపల్లె మండల అధ్యక్షులు, మండల కమీటీ నాయకులు, జనసైనికులు, వీర మహిళలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.