శేరిలింగం పల్లి ( జనస్వరం ) : స్ధానిక డిప్యూటీ కలెక్టర్ మరియు తహశీల్దార్ కార్యాలయం వద్ద అంగన్వాడీ కార్మికులు చేస్తున్న ధర్నా కార్యక్రమానికి జనసేన పార్టీ శేరిలింగం పల్లి ఇంఛార్జ్ మాధవ రెడ్డి గారు మద్దతు తెలపటం జరిగింది. జనసేన పార్టీ అంగన్వాడీ కార్మికుల ఉద్యమానికి అండగా ఉంటుందని తెలిపారు. ఈ సమావేశానికి ముఖ్య అతిధిగా జనసేన శేరిలింగం పల్లి నియోజక వర్గ ఇంఛార్జి డా. మాధవరెడ్డి గారు హాజరయ్యారు. మాధవరెడ్డి గారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరిపి, వారి న్యాయమైన డిమాండ్లను సత్వరమే పరిష్కారించాలని డిమాండ్ చేసారు. లేనియెడల రానున్న రోజుల్లో జననసేన పార్టీ ఆధ్యర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 60 వేల మంది అంగన్ వాడీ కార్మికుల కుటుంబాల పరిస్థితి అగమ్యగోచరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేసారు. 60 వేల కుటుంబాలు చాలీచాలని జీతాలతో బ్రతుకు బండిని అతికష్టంగా నెట్టుకొస్తున్నారని దిగ్భ్రాంతి వ్యక్తం చేసారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడ టీచర్ జీతాన్ని 13,000 రూపాయల నుండి 26000 రూపాయలకు, అంగన్ వాడీ హెల్పర్ జీతాన్ని 18,000/- లకు పెంచాలని జనసేన పార్టీ డిమాండ్ చేస్తుతున్నది.
వేలాది గ్రామాలు, తాండాలు, మరికివాడలు, వందలాది బీద, బడుగు, బలహీన వర్గాల కాలనీలలో అంగన్ వాడి కార్మికులు 16రోజుల నుండి సమ్మెచేస్తూ, విధులకు హాజరు కాని కారణంగా లక్షలాది మంది బంగారు భవితకు పోషకాహరం అందలేని పరిస్తితి ఈ రాష్ట్రంలో ఉందన్నారు. ప్రభుత్వం అంగన్వాడీ కార్యాలయాల కిరాయికి విడుదల చేసే మొత్తాన్ని పెరిగిన ధరలకనుగుణంగా 3000 రూపాయల నుండి 10,000 రూపాయలకు పెంచాలి మరియు 2 సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న బిల్లులను సైతం విడుదల చేయాలన్నారు. అంగన్ వాడీలకు రావల్సిన TA మరియు DAలు 24 మాసాలుగా పెండింగులో ఉన్నాయి వాటిని సైతం వెంటనే విడుదల చేయాలని, అదేవిధంగా కోవిడ్ సమయంలో మరణించిన 200 మంది అంగన్ వాడీ కార్మికులకు తగిన నష్ట పరిహారాన్ని అందించి, మిగతా వారికి 10లక్షల ఆరోగ్య భీమాని కల్పించాలని మరియు PF సౌకర్యాన్ని కల్పించాలని డిమాండ్ చేసారు. అదేవిధంగా అంగన్ వాడీ కార్మికులతో అంగన్ వాడీ పని కాకుండా, వేరే పనులు చేయించరాదు. చేయించినచో దానికి తగిన పారితోషికాన్ని వెంటనే ఇవ్వాలని హెచ్చరించారు. అదేవిధంగా ఉద్యోగ భద్రత లేకుండా ఉన్న అంగన్ వాడీ కార్మికులను పర్మినెంట్ చేసి ఉద్యోగ భద్రత కల్పించాలి. లేని యెడల రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళనలు నిరహిస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గోన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com