కార్మికుల బకాయి వేతనాలు చెల్లించేలా చర్యలు తీసుకోండి : టెక్కలి సబ్ కలెక్టర్ కు జనసేన వినతి
టెక్కలి సమగ్ర మంచి నీటి పథకంలో పైప్ లైన్ ద్వారా ఇంటింటికీ తాగునీటిని సరఫరా చేసే కాంట్రాక్టు కార్మికుల బకాయి జీతాలు వెంటనే చెల్లించాలని జనసేన పార్టీ టెక్కలి నియోజకవర్గ నాయకులు కూరాకుల యాదవ్, అట్టాడ శ్రీధర్ లు అన్నారు. కార్మికుల బకాయి వేతనాలను తక్షణమే చెల్లించాలంటూ శుక్రవారం స్థానిక సబ్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్ కు వినత పత్రాన్ని అందజేశారు. నియోజకవర్గంలోని అనేక గ్రామాలకు మంచినీటిని అందించే దిశగా గత ప్రభుత్వం కింజరాపు యర్రంనాయుడు సమగ్ర మంచి నీటి పథకం పేరుతో పట్టణము చివర్లో ఈ పధకం ప్రారంభించింది. అయితే అందులో పనిచేస్తున్న 10 మంది కాంట్రాక్టు కార్మికులకు నెలసరి వేతనాలను మాత్రం సరిగా చెల్లించడం లేదు. అలాగే ఈ కరోనా కష్టకాలంలో కూడా కార్మికులకు గత 7 నెలలుగా కనీస జీతభత్యాలు ఇవ్వకపోవడమే కాక వాళ్ళని పూర్తిగా పట్టించుకోకపోవడం చాలా బాధాకరం. అదే వృత్తిగా నమ్ముకొని స్థానిక ప్రజానీకానికి ఎల్లవేళలా నీటి సరఫరా చేస్తున్న కాంట్రాక్టు కార్మికులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని జనసేన పార్టీ డిమాండ్ చేసింది. ఈ కార్యక్రమంలో పసుపురెడ్డి సోమేశ్, రాయి సునీల్, హనుమంతు దిలిప్, బొడ్డేపల్లి వెంకటేష్, తోట శ్యామ్ పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com