Logo
Date of Publish : 19 September 2022, 3:05 pm
Editor : Sake Naresh

విష జ్వరాలు ప్రబలకుండా చర్యలు చేపట్టండి : పవనన్న ప్రజాబాటలో నలిశెట్టి శ్రీధర్

      ఆత్మకూరు, (జనస్వరం) : ఆత్మకూరు నియోజకవర్గం జనసేనపార్టీ ఇంచార్జ్ నలిశెట్టి శ్రీధర్ ఆధ్వర్యంలో జరుగుతున్న పవనన్న ప్రజాబాట 9 వ రోజున ఆత్మకూరు టౌన్ నందు జరిగింది. ఇక్కడ ప్రతి ఇంటికీ తిరిగి ప్రజాసమస్యల అధ్యయనం చేసిన నలిశెట్టి శ్రీధర్ ఆ సమస్యల పరిష్కారానికి తమవంతు పోరాటం చేస్తామని ప్రజలకు భరోసా కల్పించారు. ఈ సందర్భంగా ఆత్మకూరు నియోజకవర్గ జనసేనపార్టీ ఇంచార్జ్ నలిశెట్టి శ్రీధర్ మాట్లాడుతూ వేసవి తీవ్రత తగ్గి వాతావరణం మారి శీతాకాలం వస్తోందని, ఈ క్రమంలో ప్రజలకు విష జ్వరాలు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. గతేడాది ఇదే సమయంలో ఆత్మకూరు టౌన్ లో అనేకమంది డెంగ్యూ, టైఫాయిడ్ బారిన పడిన సంగతిని గుర్తు చేశారు. మునిసిపల్ కార్పొరేషన్ అధికారులు నిరంతరం శానిటేషన్ చేస్తూ ఉండాలని, కాలువల్లో డ్రైనేజి వ్యర్ధాలు లేకుండా, దోమలు వ్యాప్తి చెందకుండా చూడాల్సిన బాధ్యత వారిపై ఉందన్నారు. ఇప్పటి నుండే తగు చర్యలు తీసుకోకపోతే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతారని, తమ సూచనను అధికారులు సహృదయంతో స్వీకరించి విష జ్వరాలు ప్రబలకుండా చూడాలని ఆత్మకూరు నియోజకవర్గం జనసేనపార్టీ ఇంచార్జ్ నలిశెట్టి శ్రీధర్ కోరారు. ఈ కార్యక్రమంలో జనసేనపార్టీ నాయకులు సురేంద్ర, చంద్ర,వంశీ, పవన్, హజరత్, ప్రసాద్, అనిల్, ప్రశాంత్, ఏడుకొండలు, భాను కిరణ్ తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com