దాచేపల్లి, (జనస్వరం) : దాచేపల్లి మండలం దాచేపల్లి నగర పంచాయతీ పరిధిలో ఉన్న మైనింగ్ & జియాలజి శాఖా కార్యాలయంలో నియోజకవర్గ వ్యాప్తంగా జరుగుతున్న అక్రమ మైనింగ్ పై వెంటనే చర్యలు తీసుకోవాలని జనసేన జిల్లా కార్యదర్శి అంబటి మల్లి అధ్యక్షతన మెమొరాండంను మైనింగ్ ఏ డీ ఈ కి అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి అంబటి మల్లి మాట్లాడుతూ వే బిల్స్ లేకుండా సున్నపు రాయి అక్రమంగా తరలిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. లీజు దారులు అందరు కూడా వెంటనే మైనింగ్ జరిగే ప్రాంతంలో ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని, పశువులు చిన్నపిల్లలు అటువైపు వెళ్ళకుండా కాపలాదారులను నియమింప చేసేలా ఆదేశాలు ఇవ్వాలని, నడికుడిలో జరుగుతున్న అక్రమ మైనింగ్ వెంటనే నిలిపి వేసేలా చర్యలు తీసుకోవాలని మైనింగ్ అధికారులను కోరడం జరిగింది. అలాగే మండల అధ్యక్షులు దుర్గారావు మాట్లాడుతూ స్కూల్ జోన్ ప్రాంతంలో మైనింగ్ వాహనాల విద్యార్థులకు ఇబ్బందులకు గురవుతున్నారని, అధిక లోడింగ్ తో వాహనాలను నడుపుతున్నారని,వీటిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పిడుగురాళ్ల మండల అధ్యక్షులు కామిశెట్టి రమేష్ మాట్లాడుతూ మైనింగ్ లీజు దారులు అందరూ ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి అక్రమ సంపాదనకు తెర తీస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. గత ప్రభుత్వంలో మైనింగ్ జరిగిందంటూ పెడ బొబ్బులు పెట్టిన వైసీపీ నాయకులు నేడు అదే విధానాన్ని కొనసాగిస్తున్నారని ఆయన ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కిచ్చంశెట్టి లక్ష్మీనారాయణ, జిల్లా ప్రోగ్రాం కమిటీ మెంబర్ వేల్పులు చైతన్య , పిడుగురాళ్ల మండల ఉపాధ్యక్షులు బయ్యవరం రమేష్, దాచేపల్లి మండల ప్రధాన కార్యదర్శులు కోట మధు, పాముల కిషోర్, బొజ్జ ఆదినారాయణ, ఆవుల రమేష్, మండల కార్యదర్శి గురజాల నరసింహారావు, బండి నాగేశ్వరరావు, బావిరెడ్డి శ్రీకాంత్, జనసేన నాయకులు నల్లబోతుల శ్రీను, అంబటి సాయి, బీసీ నాయకులు బలిజేపల్లి సాంబశివరావు, తదితర కార్యకర్తలు పాల్గొన్నారు.