Logo
Date of Publish : 09 February 2024, 9:58 pm
Editor : Sake Naresh

తాడేపల్లిగూడెం జనసేన పార్టీలోకి చేరికలు

   తాడేపల్లిగూడెం ( జనస్వరం ) :  నియోజకవర్గంలోని వివిధ గ్రామాలకు చెందిన గంగిరెడ్ల కులస్తులు రూరల్ మండల అధ్యక్షులు అడప ప్రసాద్ నియోజవర్గ అధికార ప్రతినిధి సజ్జ సుబ్బుల ఆధ్వర్యంలో తాడేపల్లిగూడెం జనసేన పార్టీ ఇంచార్జ్  బొలిశెట్టి శ్రీనివాస్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. అనంతరం కుల నాయకులు సిహెచ్ కొండయ్య మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వం బీసీలను అన్ని రకాలుగా మోసం చేసిందని రాబోయే జనసేన తెలుగుదేశం పార్టీ ఉమ్మడి ప్రభుత్వం బీసీల కష్టాల్ని తీర్చుతుందన్నారు.. గంగిరెడ్ల ఉన్నతికి బొలిశెట్టి శ్రీను హామీ ఇవ్వడం హర్షనీయమన్నారు. నియోజకవర్గం లోని 3000 మందికి పైగా గంగిరెడ్లు కులస్తులు ఉన్నారని వారిని జనసేన వైపు నడిపే బాధ్యత తీసుకుంటామని అన్నారు. అనంతరం బొలిశెట్టి శ్రీను మాట్లాడుతూ బీసీలకు అండగా అన్ని రకాలుగా వారి ఉన్నతికి కృషి చేస్తామన్నారు. వైసీపీ ప్రభుత్వంలో మగ్గిపోతున్న పేద మధ్యతరగతి కుటుంబాల్లో వెలుగులు నిండాలంటే వైసీపీని ప్రజలు చిత్తుగా ఓడించాలన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘాల నాయకులు వర్తనపల్లి కాశీ, నీలపాల దినేష్, మట్ట రామకృష్ణ, కేశవభట్ల విజయ్, బయనపాలేపు ముఖేష్, సండక రమణ తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com