రాజంపేట ( జనస్వరం ) : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు రాజంపేట జనసేన పార్టీ ఆధ్వర్యంలో మన ఊరు మన ఆట వీర మహిళల సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. అందులో భాగంగా ముగ్గుల పోటీల కార్యక్రమం ఘనంగా నిర్వహించిన రాజంపేట జనసేన పార్టీ సమన్వయకర్త అతికారి దినేష్ మరియు జనసేన పార్టీ నాయకులు అతికారి కృష్ణ. టి సుండుపల్లి లో గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ లో భారీ స్థాయిలో టి సుండుపల్లి మరియు వీరబల్లి గ్రామాల మహిళలతో ముగ్గుల పోటీల కార్యక్రమం నిర్వహించారు. దాదాపుగా 150 మంది మహిళలు పాల్గొన్న ఈ పోటీలలో మొదటి బహుమతిగా 30 వేల రూపాయలు, రెండవ బహుమతి 20వేల రూపాయలు, మూడవ బహుమతిగా 10,000 రూపాయలు న్యాయ నిర్ణీతలు ఎంపిక చేశారు. విజేతలుగా ఎన్నికైన మహిళలకు నగదును రాజంపేట జనసేన పార్టీ సమన్వయకర్త అతికారి దినేష్, అతిగారి కృష్ణ గార్ల చేతులమీదుగా అందజేశారు. పోటీలలో పాల్గొన్న మిగతా మహిళలకు ప్రోత్సాహక బహుమతులు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో సుండుపల్లి వీరబల్లి జనసేన పార్టీ నాయకులు జనసైనికులు వీర మహిళలు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com