యలమంచిలి, మార్చి 30 (జనస్వరం) : ఎలమంచిలి తాలూకా యూనిట్ జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశం సోమవారం ఎన్‌జీవో భవన్‌లో నిర్వహించారు. ఎన్నికల అధికారులుగా జిల్లా ఎన్‌జీవో అధ్యక్షుడు పి. సూర్యనారాయణ, కార్యదర్శి డి. శేషు కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగాయి. ఎలమంచిలి తాలూకా యూనిట్ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్‌గా టీ నాగేశ్వరరావు (ఏపీఎన్జీవో), సెక్రటరీగా ఎన్. భూషణం (ఏపీటీఎఫ్), ట్రెజరర్‌గా పి. సుబ్బారావు (ఏపీఎన్జీవో) ఎన్నికయ్యారు. వైస్ చైర్మన్లుగా ఎల్.వి.ఆర్ బాబు (ఆర్టీసీ), ఏ. పాపజీరావు (పీఆర్‌టీయూ), ఎస్. రఘునాథస్వామి (ఏపీఎన్జీవో), సిహెచ్. రమణ పట్నాయక్ (రెవెన్యూ) ఎన్నికయ్యారు. సహాయ కార్యదర్శులుగా జి. సాంబమూర్తి (పెన్షనర్స్ అసోసియేషన్), ఈ. ఎల్లయ్య బాబు (యుటిఎఫ్), టి. ఆనందరాజు (ఎస్టీయూ) ఎన్నికయ్యారు. ఈసీ సభ్యులుగా కే. శామ్యూల్, బీవీ రాణి, ఏ. మల్లికార్జున్, కే. అప్పాజీ, జి. రాజశేఖర్, ఎల్. అప్పలకొండ, వీవీ శ్రీనివాసరావు, ఏ. నరసింహమూర్తి నియమితులయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే పీఆర్సీ కమిటీ చైర్మన్‌ను నియమించాలని, ఐఆర్ ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. త్వరలోనే ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు రావాల్సిన ఆర్థిక బకాయిల కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేలా ప్రణాళిక సిద్ధం చేస్తామని తెలిపారు.