
కువైట్ లో నా అన్నవాళ్ళు లేక తన రెండు కిడ్నీ లు చెడిపోయి తీవ్ర ఇబ్బందులలో ఉన్న పాలకొల్లు కి చెందిన అంబటి వీర్రాజు కు సేవలందించిన కువైట్ జనసేన నాయకులు కంచన శ్రీకాంత్ గారు. వివరాల్లోకి వెళితే గల్ఫ్ దేశమైన కువైట్ లో పశ్చిమగోదావరికి చెందిన అంబటి వీర్రాజు ఫార్వానియా ప్రాంతములో తన రెండు కిడ్నీలు చెడిపోయి దాదాపు 4 నెలలు నుండి రోజు మార్చి రోజు డయాలసిస్ చేసుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. డయాలసిస్ చేసుకోవడానికి డబ్బులు లేక, అకామా లేక అటు ఇంటికి వెళ్లలేక ఇటు పనిచేసుకోలేక ఎటు వెళ్లలేని పరిస్థితి నరకయాతన తో ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయాన్ని తన మిత్రుడు కనకరాజు ద్వారా తెలుసుకున్న జనసేన NRI సేవా సమితి(కువైట్) ఆర్గనైజింగ్ ప్రెసిడెంట్ కంచన శ్రీకాంత్ గారు వెంటనే రంగంలోకి దిగి అతనికి దైర్యం చెప్పి జనసేన NRI సేవా సమితి(కువైట్) మరియు గల్ఫ్ జనసైనికుల సహకారం తో 61,000 రూపాయలు ఆర్థిక సహాయం చేసారు. మన భారతీయ రాయబారి కార్యాలయం అధికారులు దృష్టికి తీసుకువెళ్లారు. రాయబారి కార్యాలయం అధికారులు చక్కగా స్పందించి అతనికి అన్ని విధాలా సహకరించి ఉచిత విమాన టిక్కెట్ ను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజు కంచన శ్రీకాంత్ గారు, మాదాసు నరసింహ గారు, కనక రాజు గారు కలసి వీర్రాజు గారిని దగ్గరుండి ఇండియాకు పంపించడం జరిగింది. ఈ సహాయ కార్యక్రమంలో పూర్తి సహకారాలు అందించిన జనసేన NRI సేవా సమితి(కువైట్) అధ్యక్షులు రామ చంద్ర నాయక్ గారికి, పగడాల అంజన్ కుమార్ గారికి, దండు శేఖర్ గారికి, జగిలి ఓబులేసు గారికి, రెడ్డి చెర్ల ఆంజనేయులు గారికి, కొమ్మినేని బాలాజీ గారికి, గుంటూరు శంకర్ గారికి, హర్ష గారికి, ప్రేమ్ రాయల్ నరసింహ రాయల్ (కతర్), అబుదాబి జనసేన మరియు జనసైనికులకి కృతజ్ఞతలు తెలిపారు.