
చిత్తూరు ( జనస్వరం ) : గంగాధర నెల్లూరు నియోజవర్గం కార్వేటినగరంలో నియోజకవర్గ ఇంఛార్జి డా.పొన్నా యుగంధర్ గారి అధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన మండల కమిటీ సభ్యుల పదవి ప్రమాణ స్వీకార మహోత్సవము జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన పార్టీ PAC సభ్యులు, చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా.పసుపులేటి హరి ప్రసాద్ పాల్గొన్నారు. నూతనంగా ఎన్నికైన మండల కమిటీ సభ్యులకు నియామక పత్రాలను అందజేశారు. కార్వేటినగరం మండలంలో ఇంటి పెద్దలను కోల్పోయిన కుటుంబాలకు అండగా జనసేన పార్టీ తరపున నిత్యావసర సరుకులు, ఆర్ధిక సహాయం చేయడం జరిగింది. జనసేన పార్టీ సిద్ధాంతాలు, పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు ఆకర్షితులై ఇతర పార్టీల నాయకులు డా.హరి ప్రసాద్ అధ్వర్యంలో జనసేన కండువా కప్పుకోవడం జరిగింది. నూతనంగా ఎన్నికైన మండల అధ్యక్షులు తమ మండలాల్లో జనసేన పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు బత్తిన మధు బాబు, రాష్ట్ర కార్యదర్శి ఆకేపాటి సుభాషిణి, జిల్లా కార్యదర్శి దేవర మనోహర్, కార్వేటి నగరం మండల అధ్యక్షులు, కమిటీ సభ్యులు, జనసేన నాయకులు, జనసైనికులు, వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు.