Logo
Date of Publish : 10 June 2026, 8:40 pm
Editor : Sake Naresh

ఫుడ్ సేఫ్టీ అధికారుల ఆకస్మిక తనిఖీలు

- కలుషిత ఐస్, కుళ్లిన పండ్లు, గడువు ముగిసిన పాల ప్యాకెట్ల ధ్వంసం

- పలువురు వ్యాపారులకు నోటీసులు

అనంతపురం, జూన్ 10 (జనస్వరం): నగరంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు, లీగల్ మెట్రాలజీ శాఖ అధికారులతో కలిసి జ్యూస్ సెంటర్లు, కూల్‌డ్రింక్స్ షాపులు, టీ కేఫ్‌లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో పలు దుకాణాల్లో ఆహార భద్రతా నిబంధనల ఉల్లంఘనలు గుర్తించి చర్యలు చేపట్టారు. అంజన్న టీ కేఫ్‌లో ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ చట్టం–2006 సెక్షన్ 31 కింద నోటీసులు జారీ చేసి, అనుమానాస్పద ఆహార నమూనాలను విశ్లేషణ కోసం సేకరించారు. జిహాన్ జ్యూస్ సెంటర్‌లో 15 కిలోల అపరిశుభ్రమైన ఐస్, 5 కిలోల కుళ్లిన పండ్లను గుర్తించి ధ్వంసం చేశారు. మాయాబజార్ టీ కేఫ్, వినాయక లస్సీ సెంటర్లకు కూడా సెక్షన్ 31 కింద నోటీసులు జారీ చేశారు. మున్సిపల్ కార్యాలయం ఎదురుగా ఉన్న స్టార్ జ్యూస్ కార్నర్‌లో గడువు ముగిసిన 10 లీటర్ల పాల ప్యాకెట్లను స్వాధీనం చేసుకుని ధ్వంసం చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, నోటీసులు జారీ చేయడంతో పాటు నమూనాలను విశ్లేషణ కోసం సేకరించారు. ఎస్‌ఎల్‌వీ రోజ్ మిల్క్ సెంటర్ నుంచి ఒక చట్టబద్ధ నమూనాను సేకరించగా, మహావీర్ జ్యూస్ సెంటర్ నిర్వాహకుడికి పరిశుభ్రత ప్రమాణాలు పాటించాలని సూచనలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఫుడ్ సేఫ్టీ అధికారి తస్లీమ్ మాట్లాడుతూ, ప్రజలకు సురక్షితమైన, నాణ్యమైన ఆహార పదార్థాలు అందేలా జిల్లాలో నిరంతరం తనిఖీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఆహార వ్యాపారులు పరిశుభ్రత ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని, గడువు ముగిసిన లేదా నాసిరకం ఆహార పదార్థాల విక్రయాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆహార భద్రతా చట్టం–2006 నిబంధనలను ప్రతి వ్యాపారి పాటించాలని, ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని పేర్కొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com