Logo
Date of Publish : 19 January 2021, 9:15 am
Editor : Sake Naresh

జనసేన కార్యకర్తలకు అండగా ఉంటా౦ : మంత్రాలయం ఇంచార్జ్ లక్ష్మన్న

                మంత్రాలయం నియోజకవర్గంలో జనసేన కార్యకర్తలకు తాను ఎల్లవేళలా అండగా ఉండి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని నియోజకవర్గ ఇంచార్జ్ లక్ష్మన్న తెలిపారు.. ఆదివారం కౌతాళం మండల పరిధిలోని గోతులదొడ్డి, హల్వి గ్రామాలలో జనసేన కార్యకర్తల సమావేశం నిర్వహించారు.. ఈ సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌ ఆదేశాల మేరకు నియోజకవర్గంలో గ్రామ గ్రామాన పార్టీ బలోపేతానికి కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలన్నారు... ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై జనసేన ఎల్లవేళలా పోరాటాలు చేస్తుందన్నారు.. రాబోయే ఎన్నికలలో బిజెపి, జనసేన కూటమి అభ్యర్థులు విజయం సాధించడం ఖాయమన్నారు.. పవన్‌ కళ్యాణ్‌ ఆదేశాల మేరకు త్వరలోనే గ్రామ, మండల కమిటీలను ఏర్పాటు చేసి క్షేత్రస్థాయి నుంచి జనసేన పార్టీని బలోపేతం చేస్తామన్నారు... జనసేన సైనికులు ధైర్యంగా ఉండి సమస్యలపై పోరాటాలు చేయాలన్నారు... ప్రజలకు జనసేన పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందన్నారు... కార్యకర్తలు ఎలాంటి భయాందోళనలకు గురి కావాల్సిన అవసరం లేదని, కార్యకర్తలకు తాను ఎల్లవేశల అండగా ఉంటానని తెలిపారు., రాబోయే ఎన్నికల్లో విజయం కోసం ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని పిలుపునిచ్చారు... ఈ సమావేశంలో మౌనిక నాయకులు మున్నా, దుర్గయ్య, అన్నమయ్య, హనుమేష్‌, బసవ, విజయ్‌, రవి చంద్ర తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com