ఎమ్మిగనూరు, (జనస్వరం) : కర్నూలు జిల్లాలో తీవ్ర వర్షాలకు చేతికి వచ్చిన పంటలు దెబ్బతిని రైతులు తీవ్రంగా నష్టపోయారని, ప్రభుత్వం గుర్తించి ఆదుకోవాలని ఎమ్మిగనూరు నియోజకవర్గ జనసేనపార్టీ రేఖగౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎమ్మిగనూరు నియోజకవర్గ పరిధిలోని గోనెగండ్ల, నందవరం, పరిసర గ్రామాల్లో బుధవారం రోజు పంట పొలాల దగ్గర రైతులను నేరుగా కలిసి నష్టపోయిన పంటల గురించి తెలుసుకున్నారు. అనంతరం రేఖగౌడ్ మాట్లాడుతు రాళ్ళదొడ్డి, గోనెగండ్ల, జగ్గపురం, రైతులు వేసిన మిర్చి పంటలు అధిక వర్షాలకు దెబ్బతిని కొందరు రైతులు బోరున విలపిస్తే, ఇలాగే రాష్ట్రములో నష్టపోయిన రైతులు ఎంతమంది గుండెలు పగిలేలా రోధిస్తున్నారో ఈ ప్రభుత్వానికి కనపడకపోవడం సిగ్గుచేటన్నారు. ఆంధ్రలో వరదలు, సీమలో కరువులు ఏకరువు పెడుతుంటే, నష్టపోయిన రైతుల గురించి ఆలోచించడం మానేసి కొందరు మంత్రులు తమ పదవులను కాపాడుకోవడానికి భజన రాజకీయాలు చేయడం న్యాయమ అని ప్రశ్నించారు. వర్షాకాలంలో సరైన వర్షాలు లేక పంటలు ఎండిపోయాయని, అంది వచ్చిన పంటలు చేతికి అందక అధిక వర్షానికి దెబ్బతిన్నాయని, ఇంతవరకు అధికారులు వారి వైపు చూడకపోవడం దారుణమన్నారు. లక్షల్లో అప్పులు చేసి వ్యవసాయం చేస్తున్న కొందరు కౌలు రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని అన్నారు. పదే పదే రైతు ప్రభుత్వం అని చెబుతూ రైతులను మోసం చేస్తున్న ఈ ప్రభుత్వం ఇప్పటికైనా నష్టపోయిన రైతులను గుర్తించి వారికి ధైర్యం చెప్పి ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జనసేనపార్టీ రాష్ట్ర చేనేత వికాస విభాగపు ప్రధాన కార్యదర్శి రవి ప్రకాష్, నియోజకవర్గ మీడియా ఇంఛార్జ్ గానిగ బాషా, రాహుల్ సాగర్, ఖాసీం సాహెబ్, వెంకటేష్, షబ్బీర్, రామాంజనేయులు, భాస్కర్, షఫీ తదితురులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com