Logo
Date of Publish : 24 May 2022, 4:44 pm
Editor : Sake Naresh

గోపి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకోవాలి : యుగంధర్ పొన్న

        చిత్తూరు ( జనస్వరం ) : గంగాధర నెల్లూరు నియోజకవర్గం కండ్రిగ గ్రామం కె. గోపి పురిల్లు దగ్ధం అయింది. షాట్ సర్కూట్ వల్ల పూర్తిగా పూరిళ్లు కాలియిన బాధిత కుటుంబాన్ని జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి పరామర్శించారు. సుమారు 4 లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు కుటుంబ సభ్యులు తెలపడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఈ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకోవాలని, నవరత్నాలు పేదలందరికీ ఇళ్ల పథకంలో లబ్ధిదారులైన ఈ కుటుంబానికి ప్రభుత్వమే ఆర్థిక సహాయం చేసి ఆ ఇంటి నిర్మాణం పూర్తయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను విజ్ఞప్తి చేస్తున్నానన్నారు. జనసేన పార్టీ తరఫున కూడా ఈ కుటుంబానికి సహాయం చేస్తామని హామీ ఇచ్చారు. మండల అధికారుల స్పందనకు అభినందనలు తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, అన్ని రాజకీయ పార్టీలు ఇలాంటి కుటుంబాలకు ఆదరణగా నిలవాలని, అన్ని విధాల ఆదుకోవాలని, తమ వంతు సహాయం వారికి అందించాలని ప్రత్యేకంగా పిలుపునిచ్చారు. కట్టుబట్టలతో మిగిలిపోయిన కుటుంబాన్ని ఆదుకోవాలని తెలిపారు. మానవ సేవే మాధవ సేవని, ఇబ్బందుల్లో ఉన్న వారిపట్ల ఆపన్న హస్తం అందించాల్సిన ఆవశ్యకత ఉందని ఈ సందర్భంగా తెలిపారు. రండి ఆపదలో ఉన్న కుటుంబాన్ని ఆదుకుందాం అని పిలుపునిచ్చారు. దాతలు ఎవరైనా ముందుకు వచ్చి వంట సామాగ్రి, బట్టలు, గ్యాస్ స్టవ్వు, సిలిండర్, ఇత్యాది వస్తువులు ఇవ్వడానికి ముందుకు రావాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త కార్యదర్శి రాఘవ, జనసైనికులు, స్థానికులు ఉన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com