- మీడియాపై కేసులు ఎత్తివేయండి
- కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కే. సంజయ్ కుమార్
నెల్లూరు, జూలై 24 (జనస్వరం): నెల్లూరు నగరంలోని కొండాయపాలెం గేట్ ప్రాంతంలోని అంబేద్కర్ భవన్‌లో దళిత, ఐక్య కులాల వేదిక ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కే. సంజయ్ కుమార్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా సంజయ్ కుమార్ మాట్లాడుతూ, పేద దళితుడైన ఏడుకొండలు కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. మీడియా ప్రతినిధులపై, మీడియా ఛానళ్లపై అక్రమంగా నమోదు చేసిన కేసులను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు బాల సుధాకర్ మాట్లాడుతూ, బాధిత కుటుంబానికి రూ.15 లక్షల ఎక్స్‌గ్రేషియా, పిల్లల చదువుకు పూర్తి సహకారం, రెండు ఎకరాల భూమి ఇచ్చి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అలాగే మనుబోలు ఘటనకు సంబంధించి పలు వార్తాపత్రికలు, మీడియా ఛానళ్లపై నమోదు చేసిన కేసులను బేషరతుగా ఎత్తివేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్సీ, ఎస్టీ జేఏసీ చైర్మన్ వాదనాల వెంకటరమణ పాల్గొన్నారు. కార్యక్రమంలో ట్రెజరర్ ఆనంద్ రావు, బి. గోపి, అడ్వకేట్ సుధాకర్ రెడ్డి, విటల్, రూరల్ మల్లికార్జున్ రెడ్డి, లీలా మోహన్, సేవాదళ్ సుజాత, సుధాకర్, శీను తదితరులు పాల్గొన్నారు.