
నూజివీడు ( జనస్వరం ) : నూజివీడు నియోజకవర్గం ముసునూరు మండలంలో చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు నిరసిస్తూ తెలుగుదేశం శ్రేణులు చేపట్టారు. రిలే నిరసన దీక్ష లో తెలుగు యువత రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి గద్దె రఘు బాబు, ముసునూరు గ్రామ ప్రెసిడెంట్ విజయలక్ష్మి గారు, ముసునూరు మండల తెలుగుదేశ శ్రేణులతో కలిసి అధినేత పవన్ కళ్యాణ్ గారి సూచనల మేరకు నూజివీడు జనసేన నాయకులు పాశం నాగబాబు జనసేన పార్టీ తరపున దీక్షకు మద్దతు తెలిపారు. ఆయనతో పాటు జనసేన మండల నాయకులు కడియం సత్యనారాయణ, గిరి గోపి,పల్లి నాగరాజు, పోతురాజు, తిరుమలశెట్టి సురేష్, లక్ష్మి నారాయణ, జనసేన మండల నాయకులు పాల్గొన్నారు.