ధర్మవరం ( జనస్వరం ) : ధర్మవరంలో చేనేత వృత్తిని నమ్ముకుని వందల సంఖ్యలో చేనేత కార్మికులు జీవిస్తున్నారని, వ్రస్తుతం వవర్ లూమ్స్ రావడం వల్ల చేనేత పరిశ్రమ కుంటుపడడంతో మా జీవన ప్రమాణం ప్రశ్నార్థకమై అయిందని, చేనేత పరిశ్రమను రక్షిస్తూ, చేనేత కార్మికులను ఆదుకోవాలని కోరుతూ ఆదివారం జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి స్వగృహములో ఆదివారం చేనేత కార్మికులు శ్రీనివాసులు, లోకేష్ కృష్ణప్ప, వెంకటనారాయణ లతోపాటు దాదావు 40 మంది చేనేత కార్మికులు వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం చేనేత కార్మికులు తాము పడుతున్న కష్టాలను వివరంగా చిలకం మధుసూదన్ రెడ్డికి తెలియజేశారు. ముడి సరుకులు విపరీతంగా పెరిగిపోయాయని, గత ఆరు నెలల నుండి పనిచేయడానికి పని లేదని, అరకొర చేసిన దానికి కూడా కూలి లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నామని, పవర్ లూమ్స్ లో తయారయ్యే చీరలు హ్యాండ్లూమ్. పేరు చెప్పి అమ్మకాలు జోరుగా జరగడంతో మా ఉపాధి కోల్పోతున్నామని, తాము అప్పుల పాలవుతున్నామని, మాకు ఆత్మహత్యలే శరణ్యమని బాధను వ్యక్తం చేశారు. చేనేత రిజర్వేషన్ చట్టంలో పవర్లూమ్స్, యజమానులు ఉల్లంఘించి, చట్టాన్ని అతిక్రమించి, విచ్చలవిడిగా పవర్లూమ్స్ ఏర్పాటు చేసుకొని, పట్టు చీరలు తయారు చేయడం ఎంతవరకు న్యాయమని వారు అడిగారు. ఈ సమస్యపై ప్రజాప్రతినిధులకు సంబంధిత అధికారులకు పలుమార్లు ఫిర్యాదులు చేసినా కూడా పట్టించుకున్న పాపాన పోలేదని వారు వాపోయారు. తదుపరి చిలక మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ మీ సమస్యలను మా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకొని వెళ్లి, చేనేత పరిశ్రమను కాపాడుకునేలా పోరాటాలు చేసి, పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ తవ్పక అధికారంలోకి వస్తుందని, చేనేత సమస్యలు అన్ని తీర్చడం జరుగుతుందని వారు హామీ ఇచ్చారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com