
విజయనగరం ( జనస్వరం ) : మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఇచ్చిన ప్రకటన ప్రకారం గంట్యాడ నుంచి వచ్చే పైప్ లైన్స్ మరమ్మతులు జరుగుతున్నాయి. ఒకటో తారీకు నుంచి ఐదో తారీకు వరకు నీటి సరఫరా 38వ వార్డు 37వ వార్డు 47వ వార్డు 44 వార్డు 43వ వార్డు 39 వ వార్డు 42 వార్డు ఈ డివిజన్స్ కి నీరు అందట్లేదు. ఐదు రోజులు ట్యాంకర్ల ద్వారా సరఫరా అవుతుందని మున్సిపల్ కమిషనర్ చెప్పడం జరిగింది. ఆరోజు ప్రకటన తర్వాత కూడా వాటర్ సరిగా రాకపోనందున ఆయా డివిజన్స్ లో మున్సిపల్ వాటర్ రానందున ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని, మున్సిపల్ ఆఫీస్ కి వెళ్లి డి ఈ అప్పారావు కు, తక్షణమే వాటర్ ట్యాంకర్లు ద్వారా సప్లై చేయాలని జనసేన తరపునుంచి వినతి పత్రం జనసేన నాయకురాలు మతా గాయత్రి ఆద్వర్యంలో ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు L.రవితేజ, ఎర్నాగుల చక్రవర్తి, వంశి, పవన్, మధు, భార్గవ, నవీను పాల్గొన్నారు.