Logo
Date of Publish : 07 June 2022, 3:03 pm
Editor : Sake Naresh

సప్లమెంటరీ ఫీజు రద్దు చేయాలి, ఆ భారం ప్రభుత్వమే మోయాలి : డా. యుగంధర్ పొన్న

        చిత్తూరు ( జనస్వరం ) : పదవ తరగతి లో ఫెయిల్ అయిన విద్యార్థుల నుంచి ఫీజు వసూలు చేయకుండా ఉచితంగా సప్లమెంటరీ ఫీజు లేకుండా పరీక్షలు నిర్వహించాలని జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి Dr యుగంధర్ పొన్న డిమాండ్ చేశారు. ఆ భారం కూడా ప్రభుత్వమే మోయాలని ఈ సందర్బంగా తెలిపారు. ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే 32% మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారు అన్నారు. టీచర్లను బోధనేతర పనులకు ఉపయోగించడం, పేపర్ లో లీక్ కావడం విద్యార్థులపై ప్రభావం చూపాయి అన్నారు. 71 స్కూల్ లలో ఒక్కరు కూడా పాస్ కాలేదని, అందులో 22 ప్రభుత్వ స్కూల్స్ ఉండటం సిగ్గుచేటని అన్నారు. భవిష్యత్ మార్గదర్శకులైన ఉపాధ్యాయులకు సరియైన గౌరవం, సరియైన ప్రోత్సాహం అందించాలని, వారిని వైన్ షాప్ ల వద్ద కాపలాదారులుగా పెడితే రిసల్ట్ ఇలాగే ఉంటుందని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి ఉపాధ్యాయులు కి ఇవ్వవలసిన ప్రాధాన్యత, ప్రాధాన్యత పనులు వారికిచ్చి సముచిత స్థానం కల్పించవలసిందిగా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు శోభన్ బాబు, ఉపాధ్యక్షులు లోకేష్, శ్యాం ప్రసాద్, ప్రధాన కార్యదర్శులు గణేష్, నరసింహ, సోము కార్యదర్శి గురుమూర్తి, నియోజకవర్గ సమన్వయకర్త ప్రకాష్, జనసైనికులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com