Logo
Date of Publish : 09 August 2026, 8:57 pm
Editor : Sake Naresh

ఘనంగా సూపర్ స్టార్ మహేష్ బాబు జన్మదిన వేడుకలు

ఘనంగా సూపర్ స్టార్ మహేష్ బాబు జన్మదిన వేడుకలు

నరసరావుపేట టౌన్ ఆగస్ట్ 09 ( జనస్వరం)

స్థానిక చిలకలూరిపేట రోడ్డులో గల అమ్మ - నాన్నల ప్రేమాలయం వృద్ధుల ఆశ్రమంలోని ఆవరణలో ది.టౌన్ వైడ్ సూపర్ స్టార్ కృష్ణ-మహేష్ బాబు యువశక్తి పట్టణ అధ్యక్షుడు MD.ఫారూఖ్ బాబు ఆధ్వర్యంలో యూనివర్సల్ సూపర్ స్టార్ మహేష్ బాబు 51వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ బులియన్ మర్చంట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు కపలవాయి విజయకుమార్ పాల్గొని ముందుగా కేక్ కట్ చేసి అక్కడి వృద్ధులకు, పిల్లలకు పంచిపెట్టారు.అనంతరం అభిమానులు ఏర్పాటు చేసిన అన్నదానం( బిర్యానీ) కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విజయకుమార్ మాట్లాడుతూ తండ్రికి తగ్గ తనయుడిగా రాణించటమే కాక,సుమారు ఏడువేలకు పైగా గుండె ఆపరేషన్లు చేయించి ఆ పసి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయాడని, దేవుడు ఆయనకు ఆయురారోగ్యా లతో పాటుగా చల్లగా చూడాలని కోరుకున్నారు. ఈ సందర్భంగా మహేష్ బాబు కు 51వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.పట్టణ అధ్యక్షులు ఫారూఖ్ బాబు మాట్లాడుతూ ఇటువంటీ సేవా కార్యక్రమాలే కాకుండా మన పట్టణంలో మాజీ మంత్రి వర్యులు కాసుకృష్ణారెడ్డి ఆశీస్సులతో, పొన్నపాటి ఈశ్వరరెడ్డి,కపలవాయి విజయకుమార్ సహాకారంతో పట్టణంలో సూపర్ స్టార్ కృష్ణ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలను కుంటున్నట్లు తెలియజేశారు. మునుముందు మరిన్ని సేవా కార్యక్రమాలు మా అభిమాన సంఘo ద్వారా చేయడమే గాక సంఘంలో మంచి గుర్తింపు పొందాలనుకుంటునట్లు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో అభిమానులు బి.కొండాలరావు, లింగంగుంట్ల రాములు, కందుకూరి దిలీప్, షేక్ సుభాని,యన్నం వీరారెడ్డి, ఫోటోగ్రాఫర్ చిన్నికృష్ణ , షేక్ నబీ బాజీ, యన్.గోపికృష్ణ, యన్.జయ కృష్ణ ,షేక్. సుభాని R.M.P., ప్రిన్స్ బాషా, షేక్ మీరావలి, కుక్కల పాలు, సాగర్, మన్నేపల్లి శ్రీను, జి.వెంకీ బాబు, కె.రమేష్ బాబు మరియు వృద్ధాశ్రమ నిర్వహకులు ధనుంజయ్ తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com