Logo
Date of Publish : 17 February 2022, 5:32 pm
Editor : Sake Naresh

వీఆర్ఏల ధర్నాకు సంపూర్ణ మద్దతు ప్రకటించిన సుండుపల్లి జనసేన నాయకులు

    సుండుపల్లి, (జనస్వరం) : గత పది రోజులుగా కొనసాగుతున్న వీఆర్ఏల ధర్నాకు సంపూర్ణ మద్దతుగా జనసేన ఆధ్వర్యంలో సుండుపల్లి మండల తహశీల్దార్  శ్రీలత గారికి వినతిపత్రాన్ని ఇవ్వడం జరిగింది. ఏడు న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలంటూ సుండుపల్లి తహసీల్దార్ ఆఫీస్ వద్ద వీఆర్ఏలు ధర్నా 10వ రోజు కొనసాగుతుండగా జనసేనపార్టీ తరపున సంఘిభావం తెలిపారు. జనసేనపార్టీ నాయకులు రామ శ్రీనివాసులు మాట్లాడుతూ విఆర్ఎలకు 21000 రూపాయలు వేతన ఇవ్వాలని ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇచ్చిన డిఎ రికవరీ ఉత్తర్వులు ఉపసంహరించాలి. డిఎతో కూడిన వేతనం ఇవ్వాలని, నామినీలుగా పనిచేస్తున్న వారందరినీ విఆర్ఎలుగా నియమించి ఆ కుటుంబాలకు న్యాయం చెయ్యాలన్నారు. అర్హులందరికీ ప్రమోషన్లు ఇవ్వాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలన్ని విఆర్ఎలకు వర్తింప చెయ్యాలన్నారు. గత 10 రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సీఐటీయూ జిందాబాద్ అని నినాదాలు చేస్తూ ధర్నా ఉద్యమించారు. ఈ కార్యక్రమంలో మండల జనసేనపార్టీ వీర మహిళ రెడ్డిరాని, జనసేనపార్టీ నాయకులు రామశ్రీనివాసులు, ఓబులేసు, చెన్నకృష్ణ, శ్రీరాములు అలానే మండల వి.ఆర్.ఏలు అల్లబకాశ్, నాగరాజ రమణ, శంకరయ్య, లలితమ్మ, జగన్నాథం, అల్లావుద్దీన్, అన్వర్, శివ, జయరామయ్య, మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com