Logo
Date of Publish : 20 March 2023, 3:53 pm
Editor : Sake Naresh

ఎమ్మెల్సీ ఎన్నికల్లో దొంగ ఓట్లు వేసేవారిపైన సుమోటోగా కేసు నమోదు చేయాలి : ఆదాడ మోహనరావు

     విజయనగరం ( జనస్వరం ) : ఎమ్మెల్సీ ఎన్నికల్లో దొంగ ఓట్లు వేసే వారిపైన, వారికి సహకరించిన సంబంధిత అధికారులు,వ్యక్తులపైన మీడియాల్లో వచ్చిన వార్తా కథనాల ప్రకారం.. తగు విచారణ జరిపి,వారిపై సుమోటోగా కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జనసేన పార్టీ నాయకులు ఆదాడ మోహనరావు డిమాండ్ చేశారు. దీనిపై సోమవారం ఉదయం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కు కలక్టర్ గ్రీవెన్స్ లో విజయనగరం జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ఎన్నికల కమీషన్ ఎమ్మెల్సీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని వివిధ రాజకీయ పార్టీలతో సమీక్షలు నిర్వహించి, పట్టభద్రులకు ఓట్లు నమోదు చేసుకోవాల్సిందిగా పిలుపునిచ్చి, తీరా పట్టభద్రుల ఎన్నికల రోజు రాజ్యాంగానికి విరుద్ధంగా ఐదో తరగతి, ఏడో తరగతి చదివిన వారికి సైతం డిగ్రీ దొంగ పట్టాలను సృష్టించి, కష్టపడి డిగ్రీ చదువుకున్న విద్యార్ధుల మనోభావాలు దెబ్బతినేలాచేసి, రాజ్యాంగాన్ని కాలరాసే విధంగా చేసిన వారిపై వివిధ మాధ్యమాలలో వచ్చిన కథనాలను ఆధారంగా చేసుకుని దొంగ ఓట్లు వేసే వారిపైన వారికి సహకరించిన అందరికీ సుమోటో కేసుగా పరిగణించి,వారిపై కేసులు నమోదు చేసి చట్టపరమైన తీసుకోవాలని కోరారు. ఈ విషయమై జిల్లా కలెక్టర్ కు వినతి పత్రాన్ని ఇచ్చామని, దానికి కలక్టర్ సానుకూలంగా స్పందించారని తెలిపారు. వినతిపత్రాన్ని ఇచ్చిన వారిలో పార్టీ నాయకులు దంతులూరి రామచంద్ర రాజు, త్యాడ రామకృష్ణారావు(బాలు) పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com