సూళ్లూరుపేట, (జనస్వరం) : సూళ్లూరుపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఆధ్వర్యంలో దొరవారి సత్రం మండలం అయ్యపాలెం, అక్రపాక, గ్రామలో నెల్లూరు జిల్లా సంయుక్త కార్యదర్శి బురకాల లీలామోహన్ గారు సూళ్లూరుపేట నియోజకవర్గం వీరమహిళా నాయకురాలు బురకాల గీతాంజలి గారు పర్యటించడం జరిగింది. అలాగే అక్కడ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఇంటి ఇంటికి వెళ్లి తెలుసుకోవడం జరిగింది. వారు అయ్యపాలెంలో ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్యలు రోడ్లు, డ్రైనేజీ కాలువలు, డయాలసిస్, క్యాన్సర్ వృద్ధులకు పింఛన్లు, వాటర్, ఇళ్ల సమస్యలు చెప్పడం జరిగింది. ఈ సమస్యలన్నింటినీ అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చేసే విధంగా వారికి హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్, ప్రశాంత్, యోగేష్, సన్నీ, ముని రాజా జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com