
సూళ్లూరుపేట, (జనస్వరం) : నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గం దొరవారీ సత్రం మండలలో దొరవారిసత్రం జిల్లా పరిషత్ హైస్కూల్ నందు జనసేనపార్టీ జిల్లా సంయుక్త కార్యదర్శి, సూళ్లూరుపేట నియోజకవర్గం యువ నాయకులు బురకాల లీలామోహన్, సూళ్లూరుపేట నియోజకవర్గం మహిళా నాయకురాలు బురకాల గీతాంజలి, దొర వారిసత్రం మండలం జనసేన పార్టీ మండల అధ్యక్షులు దువ్వూరు సనత్ కుమార్ ఆధ్వర్యంలో నెల్లూరు రెడ్ క్రాస్ సంస్థ వారి సహకారంతో మెగా రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా సంయుక్త కార్యదర్శి లీలా మోహన్ మాట్లాడుతూ స్వచ్ఛందంగా యువత ముందుకు వచ్చి 40 మంది రక్తదానం చేయడం జరిగింది. మెగా రక్తదాన శిబిరానికి విచ్చేసి రక్తదానం చేసిన జన సైనికులకు, మెగా అభిమానులకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసైనికులు, వెంకయ్య మునిరాజా, నరేంద్ర, శివ తదితరులు పాల్గొన్నారు.