సూళ్లూరుపేట ( జనస్వరం ) : 35 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న కుటుంబం నుండి ఆవల సతీష్, అయన అనుచరులతో సూళ్లూరుపేట మండలాధ్యక్షుడు ఆవల రమణ మరియు జనసేన నాయకులు పొన్న కట్టయ్య గారి అద్వర్యంలో జనసేన పార్టీ లో చేరారు. కష్టం వచ్చిన వారిని తన సొంత డబ్బుతో ఆదుకునే మనస్తత్వం ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ అని, ఆయన కష్టాల్లో ఉన్న ఎంతో మంది ప్రజలకు సహాయపడ్డారు. అయన విశాఖ ఫిషింగ్ హార్బర్ లో నష్ట పోయిన మత్స్యకార కుటుంబాలకి కూడా ఒక్కొక్కరికి యాబై వేల రూపాయల చొప్పున సహాయం చేసి సామాన్య ప్రజల మనసు గెల్చుకున్నారని. పవన్ కళ్యాణ్ సేవ స్ఫూర్తి నచ్చి మేము జనసేన పార్టీలో చేరడం జరిగిందని ఆవల సతీష్(దాస్) తెలియజేసారు. పవన్ కళ్యాణ్ కి సూళ్లూరుపేట నియోజకవర్గంలో ఎంతో ప్రజాదరణ ఉందని, అయన సిద్ధాంతాలు మెచ్చి నూతనం యువకులే కాకుండా రాజకీయ అనుభవజ్ఞులు కూడా పార్టీ చేరుతున్నారని ఇంచార్జి ఉయ్యాల ప్రవీణ్ తెలిపారు. సూళ్లూరుపేట నియోజకవర్గంలో జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థిని గెలిపించుకొని జనసేన టీడీపీ ప్రభుత్వం స్థాపించుకుంటామని ఉయ్యాల ప్రవీణ్ అన్నారు. ఆవల సతీష్ వెంట కృష్ణ మూర్తి, ఆవల రాజ్ కుమార్, ముప్పవరపు ప్రభుకుమార్ ( జాయ్) పార్టీలో చేరారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com