Logo
Date of Publish : 21 June 2022, 4:49 pm
Editor : Sake Naresh

అంబేద్కర్ సర్కిల్ నందు సులబ్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయాలి : పత్తికొండ జనసేన నాయకులు

      పత్తికొండ, (జనస్వరం) : పత్తికొండ గ్రామపంచాయతీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ని కలిసి సులబ్ కాంప్లెక్స్ లు పత్తికొండ టౌన్ లో నిర్మించాలని జనసేన పార్టీ తరఫున వినతి ఇవ్వడం జరిగింది. పత్తికొండ పట్టణంలోని పాత బస్టాండ్ అంబేద్కర్ సర్కిల్ నందు, సులబ్ కాంప్లెక్స్ లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయంపై గతంలో గ్రామపంచాయతీ అధికారులకు సులబ్ కాంప్లెక్స్ ఏర్పాటుచేయాలని జనసేన పార్టీ తరఫున వినతి పత్రం అందజేశామన్నారు. అయితే గతంలో ఇక్కడ పనిచేసిన ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కృష్ణమోహన్ పంచాయతీ అధికారులు అంబేద్కర్ సర్కిల్ నందు సులబ్ కాంప్లెక్స్ నిర్మించడం కోసం ఏర్పాట్లు చేశారు. సులబ్ కాంప్లెక్స్ రూమ్ నిర్మించబోతున్నమని, గతంలో పత్తికొండలో పనిచేసిన ఈవో  మాకు తెలియజేశారు. కానీ ఇప్పుడు నిర్మిస్తున్న రూము ఇతర వాటికి ఏర్పాటు చేస్తున్నారని, మా దృష్టికి వచ్చింది. కావున అంబేద్కర్ సర్కిల్లో సులబ్ కాంప్లెక్స్ లేకపోవడంతో, ప్రయాణికులు ముఖ్యంగా మహిళలు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కావున పాత బస్టాండ్ అంబేద్కర్ సర్కిల్లో ప్రస్తుతం నిర్మిస్తున్న రూము సులబ్ కాంప్లెక్స్ కేటాయించాలని, ప్రస్తుతం పత్తికొండ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా బాధ్యతలు చేపట్టిన నరసింహులు కి వినతి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు నిర్మిస్తున్న రూము సులబ్ కాంప్లెక్స్ కు నిర్మించాలని, ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని విజ్ఞప్తి చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన పార్టీ నాయకులు ఇస్మాయిల్, జానీ, అనిల్, ఎర్ర స్వామి తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com