నీట మునిగిన ఇళ్ళు, 3 కుటుంబాలకు ఆర్థిక సహాయంగా రూ. 10,000 చేసిన పోతవరం జనసైనికులు
పశ్చిమగోదావరి జిల్లా, గోపాలపురం నియోజకవర్గము, నల్లజర్ల మండలము పోతవరం జనసేన పార్టీ ఆధ్వర్యంలో వర్షాలు కారణముగా 3 ఇల్లు నీట మునిగాయి. ఆ కుటుంబాలకు పోతవరం జనసైనికులు 10,000 వేల రూపాయలు ఆర్ధిక సహాయం చేయడం జరిగింది. ఆ కుటుంబాలకు రైస్ ప్యాకెట్లు మరియు నిత్యావసర సరుకులు అందించడం జరిగింది. ఈ సహాయ సహకారాలు జనసైనికులు వారి సొంత ఖర్చులతో చేయడం జరిగింది. జనసైనికులు మాట్లాడుతూ గ్రామంలో ఎవరికి ఏం కష్టం వచ్చినా జనసేన పార్టీ, జనసైనికులు అండగా ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసైనికులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.