Logo
Date of Publish : 19 February 2022, 1:30 pm
Editor : Sake Naresh

టీటీడీలో సుబ్బారెడ్డి చైర్మన్ గా అధర్మ పాలన : తిరుపతి జనసేన నాయకులు

    తిరుపతి ( జనస్వరం ) : ప్రపంచ ప్రసిద్ధి గాంచిన తిరుమల శ్రీవారి ఆలయంలో దశాబ్దాల కాలంగా ఉన్న ఏ పాలకమండలి చేయని, దోపిడిని దర్శనాలకు కొత్త పేర్లు జోడించి తద్వారా కోట్ల రూపాయలు టీటీడీకి అందుతుందని తిరుపతి జనసేన నాయకులు మీడియా ముఖంగా తెలియజేస్తున్నారు. ఈ ధనంతో చిన్నపిల్లల వైద్య సేవల పేరుతో సేవ చేస్తాం అంటూ... నేటి వైసిపి ప్రభుత్వం ఏర్పాటు చేసిన టిటిడి పాలకమండలి గొప్పలు చెప్పుకుంటున్నారన్నారు. చైర్మన్ సుబ్బా రెడ్డి పాలనలో పూర్తి అధర్మo కొనసాగుతున్నదని జనసేన పార్టీ తిరుపతి అసెంబ్లీ ఇంచార్జ్ కిరణ్ రాయల్ ఆరోపించారు. గతంలో రాజకీయ పార్టీలకు సంబంధించిన టీటీడీ పాలకమండలిలు కొనసాగించని ఆధర్మ పాలనను నేటి చైర్మన్ ధర్మారెడ్డి కొనసాగిస్తున్నారని విమర్శించారు.

    దోచుకోవడమే ధ్యేయంగా వైసిపి ఆశీస్సులతో శ్రీవారి ఆలయ ప్రతిష్టకు భంగం కలిగేలా వ్యవహరిస్తున్నారని దుయ్యంబట్టారు. శుక్రవారం బుక్ చేసుకునే ఉదయాస్తమాన సేవల దర్శనాన్ని ప్రవేశపెట్టి వాటిని బోర్డు మెంబర్లు పంచుకుంటూ కోట్ల రూపాయల వ్యాపారాలు చేసుకోవడం బాధాకరమన్నారు. కొత్త సినిమా టికెట్ల కోసం కొట్టుకున్నట్లు టీటీడీ పాలక మండలి సభ్యులు ఈ టికెట్ల దందాలో కీచులాడుకోవడం. బోర్డు మెంబర్ల అవినీతి బాగోతం సోషల్ మీడియాలో వచ్చిన వీడియోను చూస్తే అర్థమవుతుందన్నారు. దీనిపై నిజానిజాలను భక్తులకు తెలియజేసి... వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. గతంలో ఉన్నట్లే ప్రైవేట్ హోటళ్లను కూడా కొనసాగించి ఇటు స్థానికుల బ్రతుకులను  ఆటు భక్తుల ఆకలి రుచులను తీర్చాలని కోరారు. ఈ ప్రెస్ మీట్ కార్యక్రమంలో జనసేన సిటీ ప్రెసిడెంట్ రాజారెడ్డి, జిల్లా నాయకులు రాజేష్ యాదవ్, హేమకుమార్, కీర్తన మరియు బాబ్జి, సుమన్ బాబు, మునస్వామి, ఈశ్వర్ రాయల్, అమృత, కోమల్ బాబు, తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com