మహిళలు, చిన్నారుల భద్రతపై పోలీసుల అవగాహన కార్యక్రమం - ఎస్ఐ పి.అనిల్ కుమార్.
ముప్పాళ్ళ,జూలై 06 ( జనస్వరం).
పల్నాడు జిల్లా ఎస్పీ ఉత్తర్వుల మేరకు, డీఎస్పీ సూచనలతో ముప్పాళ్ల సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ పి.అనిల్ కుమార్ ఆధ్వర్యంలో మహిళలు, చిన్నారులపై జరుగుతున్న లైంగిక నేరాలు,రోడ్డు ప్రమాదాలు, సైబర్ నేరాల పట్ల ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు ముప్పాళ్ల గ్రామంలో అవగాహన కార్యక్రమాన్ని పోలీసులు నిర్వహించారు.ఈ సందర్భంగా ముప్పాళ్ళ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ పి. అనిల్ కుమార్ మాట్లాడుతూ మహిళలు, పిల్లలు లైంగిక వేధింపులు, మోసాల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అత్యవసర పరిస్థితుల్లో పోలీసులను ఎలా సంప్రదించాలి, సైబర్ మోసాలను ఎలా గుర్తించాలి, సోషల్ మీడియా వినియోగంలో పాటించాల్సిన జాగ్రత్తలు, అలాగే రోడ్డు భద్రతా నియమాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ముఖ్యంగా మహిళలు, చిన్నారుల భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని, అనుమానాస్పద సంఘటనలు, సైబర్ మోసాలు లేదా వేధింపులు ఎదురైతే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణలో ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, హెల్మెట్,సీట్ బెల్ట్ వాడకం యొక్క ప్రాధాన్యతను వివరించారు.
ఈ కార్యక్రమానికి ముస్లిం ఏరియాకు చెందిన సుమారు 80 మంది స్థానికులు హాజరైనారు. పోలీసులు మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు