నర్సీపట్నం, (జనస్వరం) : విశాఖ జిల్లా నాతవరం హైస్కూల్లో విద్యార్థులకు నాణ్యత లేని మధ్యాహ్న భోజనం పెడుతున్నారని జనసేనపార్టీ నర్సీపట్నం నియోజకవర్గ కన్వీనర్ రాజాన వీరసూర్యచంద్ర ఆరోపించారు. గతవారం రోజులుగా నాణ్యత లేని భోజనం పెట్టడం వల్ల విద్యార్థులు భోజనం చేయకుండా పారేస్తున్న విషయం తన దృష్టికి రావడంతో శుక్రవారం పాఠశాలకు వెళ్లి మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేయడం జరిగింది. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ విద్యార్థులతో వారి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నానరు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టడం లేదని గత వారంరోజులుగా ఇదే పరిస్థితి ఏర్పడిందని, నాణ్యత లేని భోజనం పెట్టడంతో విద్యార్థులు ఆ భోజనాన్ని పడేస్తున్న పరిస్థితి ఉందన్నారు. ఫలితంగా విద్యార్థులు పస్తులు ఉండాల్సిన పరిస్టితి ఏర్పడిందని అదే విధంగా ఇక్కడ టీచర్ల కొరత కూడా ఉందని, తక్షణమే పూర్తిస్థాయిలో పాఠశాలలో టీచర్ పోస్తులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో జనసేన తరపున పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పాల్గొన్నారు.