● పదవ తరగతి ఫెయిల్ అయిన విద్యార్థులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్ అయ్యింది
● ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి బాధ్యత వహించి తక్షణమే తమ పదవులకు రాజీనామా చేయాలి?
అనంతపురం, (జనస్వరం) : పదవ తరగతి విద్యార్థుల జీవితాలతో ఆటలాడిన రాష్ట్ర ప్రభుత్వం? అమ్మ ఒడి రూపంలో పిల్లలకు తల్లులకు కొంతమేర డబ్బులు ఇచ్చి, వివిధ రూపాల్లో ఆ డబ్బుల్ని లాక్కొంటున్నా రాష్ట్ర ప్రభుత్వం? పదవ తరగతి విద్యార్థుల పరీక్షల్లో కావాలని మార్కులు తక్కువ వేసి ఫెయిల్ చేసి సప్లమెంటరీ ఎగ్జామ్ పేరుతో, రివల్యూషన్, రీకలెక్షన్ పేరుతో పిల్లల తల్లిదండ్రుల దగ్గర డబ్బు లాగే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుందని అర్థమైపోయింది. రాష్ట్ర ప్రభుత్వం పదవ తరగతి పాసై ఇంటర్మీడియట్ కు విద్యార్థులు వెళితే విద్యా దీవెన కింద డబ్బులు పిల్లల తల్లిదండ్రుల అకౌంట్ లోకి వేయాల్సి వస్తుందని కావాలనే నేడు రెండు లక్షల మంది విద్యార్థులను ఫెయిల్ చేసింది. ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నేటి వరకు డీఎస్సీ నిర్వహించకపోవడం, ఉపాధ్యాయుల కొరత, ఉపాధ్యాయులు తమకు రావలసిన న్యాయమైన పిఆర్సి, అలవెన్సులు విషయంలో ప్రభుత్వంతో గొడవకుదిగి మనోవేదనతో సక్రమంగా పిల్లలకు విద్యా బోధన చేయకపోవడం వల్ల రాష్ట్రంలో పదో తరగతి పిల్లలకు ఈ దౌర్భాగ్య స్థితి దాపురించిందని జయరాం అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కేవలం గొప్పలు చెప్పుకుంటూ, ప్రకటనల పిచ్చి పట్టి.. క్షేత్రస్థాయిలో చిత్తశుద్ధి లేకుండా విద్యార్థుల పట్ల బాధ్యత లేకుండా నూతన విద్యా విధానం పేరుతో శాస్త్రీయత లేకుండా YS జగన్మోహన్ రెడ్డి అనుచిత నిర్ణయాల వల్ల విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారయింది. విద్యార్థుల పట్ల ఆశ్రద్ధతో వ్యవహరించడం దుర్మార్గ, నీచమైన చర్య. రాష్ట్ర ప్రభుత్వానికి, విద్యా శాఖ మంత్రికి చిత్తశుద్ధి ఉంటే పరీక్ష ఫీజు వసూలు చేయకుండా పిల్లలకు సప్లిమెంటరీ ఎగ్జామ్ నిర్వహించాలి. పిల్లల తల్లిదండ్రులతో ఎటువంటి రుసుము వసూలు చేయకుండా రివల్యూషన్, రీకౌంటింగ్ నిర్వచించి ప్రభుత్వం చేసిన తప్పుల్ని సరిదిద్దుకోవాలని జనసేనపార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నామని అన్నారు.ఈ కార్యక్రమంలో అంతపురం జిల్లా జనసేన ఉపాధ్యక్షులు లాయర్ కుంటిమద్ది జయరాం రెడ్డి, లీగల్ సెల్ అధ్యక్షుడు మురళీకృష్ణ, జనసేన నాయకులు పాలగిరి చరణ్ తేజ్ పాల్గొన్నారు.