పామిడి ( జనస్వరం ) : రాష్ట్ర ప్రభుత్వం సోమవారం విడుదల చేసిన పదవ తరగతి ఫలితాల్లో విద్యార్థులు ఫెయిల్ కాలేదని, ప్రభుత్వ పర్యవేక్షణ ఫెయిల్ అయినట్లు స్పష్టమైందని జనసేన పార్టీ పామిడి మండల అధ్యక్షుడు ధనుంజయ పేర్కొన్నారు. పామిడి మండలంలోని కట్టకిందపల్లి గ్రామంలో పదవ తరగతి చదువుతున్న విద్యార్ధిని శిరీష(15) ఫెయిల్ కావడంతో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. పామిడి ప్రభుత్వ ఆసుపత్రిలో మంగళవారం ఆయన జనసేన నాయకులుతో కలిసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది పదవ తరగతి ఫలితాలతో రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ప్రచార ఆర్భాటాలు చేయడం తప్ప, విద్యార్థులు విద్యాభివృద్ధి పై శ్రద్ధ చూపడం లేదని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఒక్క డీఏస్సీ కూడా విడుదల చేయలేదన్నారు. ఉపాద్యాయుల పోస్టులు భర్తీ చేసేందుకు ప్రభుత్వం నీళ్లు వదిలిందన్నారు. విద్యాశాఖ తరుపున అందజేసే సంక్షేమ పథకాలు కోత పెట్టేందుకే పదవ తరగతి ఫలితాలతో కుట్ర పన్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు జనసేన కార్యదర్శులు C.ధన, జమీర్ సూర్య ఖాజావలి, మరియు జనసేన పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.