ఇచ్చాపురం ( జనస్వరం ) : ఇచ్చాపురం నియోజకవర్గంలో వందల మందికి ప్రధాన సమస్యగా మారిన ఇచ్చాపురం మున్సిపాలిటీలో గల రైల్వే గేట్ నెం.329 అండర్ పాసింగ్ బ్రిడ్జి కొరకు శాంతియుత ధర్నా చేపట్టడానికి అనుమతి తీసుకుని ధర్నా చేయడానికి సిద్ధపడిన సమయంలో ఉదయం గం.7-30ని.లకు ఇచ్చాపురం నియోజకవర్గ జనసేన ఇంచార్జ్ దాసరి రాజు గారిని, మున్సిపాలిటీ ఇన్చార్జిలు రోకలి భాస్కరరావు, కలియా గౌడో గారిని నిర్బంధించడం జరిగింది. ఈ విషయం తెలిసి కొంతమంది జనసేన నాయకులు రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ బైపల్లి ఈశ్వర రావు, జడ్పిటిసి అభ్యర్థి డొక్కరి ఈశ్వరరావు, మత్స్యకార వికాస విభాగ కార్యదర్శి నాగుల హరిబెహారా, వార్డ్ ఇంచార్జ్ లు సంతోష్ మహారణ, ఢిల్లీ బిసాయి, కుసుంపురం సర్పంచ్ అభ్యర్థి అంగ సురేష్, వీర మహిళలు శైలజ, దుర్గాసి నీలవేణి జనసేన సోషల్ మీడియా ప్రతినిధి రామకృష్ణ మరియు తదితర జనసేన నాయకులను నిర్భదించి స్టేషన్ లోపల పలాస DSP గారితో సమావేశం ఏర్పాటు చేసి సమస్యను పరిష్కరించే దిశగా తీసుకు వెళ్తామని చెప్పడం జరిగింది. జనసేన నాయకులను నిర్భదించిన విషయం తెలుసుకుని ఇచ్చాపురం పోలీసు స్టేషన్ వద్దకు భారీగా జనసైనికులు చేరుకున్నారు. అనంతరం నాయకులు బయటకు వచ్చి తరువాత జనసేన శ్రేణులతో కలిసి ఇచ్చాపురం రైల్వే స్టేషన్ మాస్టర్ గారికి ఆ సమస్యను అధికారులకు తెలియజేసి సమస్యను పరిష్కరించే విధంగా చేయాలని వినతిపత్రం మరల ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున నియోజకవర్గం మొత్తం జననాయకులు, వీరమహిళలు, జనసైనికులు పాల్గొన్నారు. ప్రజా సమస్యపై పోరాటం చేస్తున్న జనసేనపార్టీ ని ప్రజలు మద్దతు తెలుపుతూ అభినందించారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com