Logo
Date of Publish : 08 October 2021, 4:44 pm
Editor : Sake Naresh

బాలికలపై మరియు మహిళలపై అత్యాచారాలను అరికట్టేందుకు కఠిన శిక్షలు అమలు చేయాలి : జనసేన వీర మహిళ కాటం అశ్విని

         విజయనగరం ( జనస్వరం ) : బాలికలపైన మరియు మహిళలు పైన అత్యాచారాలను అరికట్టేందుకు ప్రభుత్వం వెంటనే కఠినమైనశిక్షలు అమలు చేయాలని వియజనగరం జనసేన పార్టీ రాష్ట్ర చేనేత వికాస విభాగం రాష్ట్ర కార్యదర్శి కాటం అశ్వని డిమాండ్ చేసారు. ఈమధ్యనే విశాఖ జిల్లా ఆగనంపూడిలో అత్యాచారానికి గురై మృతిచెందిన.. విజయనగరం జిల్లా, చీపురుపల్లి నియోజకవర్గం, పి.కె.పాలవలస గ్రామస్తురాలు, పదమూడు సంవత్సరాల చిరంజీవి పాండ్రంకి కీర్తన స్వగ్రామంలో కుటుంబ సభ్యులను జనసేన పార్టీ తరుపున సంఘీభావం తెలిపేందుకు కలిసారు. ఈ సందర్భంగా ఆమె బాధిత కుటుంబాన్ని కలసి ఓదార్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అభంశుభం తెలియని పసికందులను, మహిళలపై కొందరు కామాంధుల చేతుల్లో బలైపోతున్నారని, ఇటువంటి ఉన్మాదులకు సరియైన రీతిలో కఠినమైన శిక్షలు అమలుచేసే చట్టాలు ప్రభుత్వం తీసుకురావాలని ఆమె ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి తగు న్యాయం చేయాలని, మృతి చెందిన కీర్తన శరీరంపై గాయాలపై సమాధానం పోలీసులు తగు విచారణ జరిపి తెలపాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో చీపురుపల్లి నియోజకవర్గం జనసేన నాయకులు పెద్ది వెంకటేష్, నాయుడు, యేసు, చిన్న౦నాయుడు, వినోద్ కుమార్, విజయనగరం నాయకులు త్యాడ రామకృష్ణారావు(బాలు), ఎర్నాగుల చక్రవర్తి, రవిరాజ్ చౌదరి,హుస్సేన్ ఖాన్, భవాని,తాతంపూడి రామకృష్ణ గారు తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com