నూజీవీడు ( జనస్వరం ) : ఆగిరిపల్లిలో కానిస్టేబుల్ నరేంద్రపై దాడి చేసి మృతికి కారణమైన ఉలస.రామకృష్ణకు జనసేన పార్టీకి ఎటువంటి సంబంధం లేదని ఈరోజు విడుదల చేసిన ఒక ప్రకటనలో జనసేన పార్టీ నూజివీడు నాయకులు పాశం నాగబాబు తెలిపారు. అతనికి పార్టీ సభ్యత్వం గానీ, పార్టీ కార్యక్రమాల్లో ఏనాడు పాల్గొన్న దాఖలాలు గాని లేవు. వైయస్ఆర్ సీపీ నాయకులు, వారి సోషల్ మీడియా కావాలని జనసేన పై బురద చల్లడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ రకమైన పోస్ట్లు లపై పోలీసులు విచారణ జరిపి తప్పుడు సమాచారంతో పోస్టులు పెడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము. ప్రజలను పోలీసు వ్యవస్థను తప్పుదారి పట్టిస్తూ ఇలా జనసేన పార్టీ పై తప్పుడు ప్రచారం చేయడాన్ని ఖండిస్తున్నాము.ఈ దాడికి పాల్పడిన అతను ఏ పార్టీ అయినా కానిస్టేబుల్ మృతికి కారణమైన అతన్ని కఠినంగా శిక్షించాలని జనసేన పార్టీగా డిమాండ్ చేస్తున్నామని అన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com